నిర్మల్ జిల్లా(Nirmal District)లో ఆర్టీసీ బస్సులో పాము కలకలం రేపింది. కుంటాల మండలం ఓలా నుంచి నిర్మల్ వైపు ప్రయాణికులతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు (Palle velugu bus) బయలు దేరింది. ఒక్కో గ్రామంలో ప్రయాణికులతో పాటు విద్యార్థులు ఎక్కుతూ వచ్చేసరికి రద్దీ పెరిగింది.ఈ క్రమంలో కొందరు విద్యార్థులు బస్సు వెనుక సీట్లవైపు వెళ్లారు. బస్ రన్నింగ్ లో ఉండగానే సీటు కింద తిరుగుతున్న పామును విద్యార్థులు గుర్తించారు.
అప్రమత్తమైన డ్రైవర్ నర్సాపూర్ (Narsapur) వద్ద బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించారు.. పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. ఆయన దానిని బంధించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. చివరికి పాము(Snake)ను చంపేయడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము కాటు వేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు ప్రయాణికులు(Passengers). కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు (Netizens) వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.