ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు తక్కువ. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న తెలుగు హీరోయిన్లను వేళ్ల పై లెక్క పెట్టవచ్చు. అందుకే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాలని, ఇటీవల బేబీ సినిమా సక్సెస్ మీట్లో మరీ మరీ చెప్పుకొచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలాంటి వారిలో కళ్లతోనే మాయ చేస్తోంది తెలుగు బ్యూటీ రీతు వర్మ.
Rituvarma: పక్కా హైదరాబాది అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఎప్పుడు కూడా హద్దులు దాటి గ్లామర్ షో చేయలేదు రీతు వర్మ. ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్షా’ సినిమాతో తెరంగేట్రం చేసింది రీతూ. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చెల్లెలు పాత్రలో నటించింది.
ఆ తర్వాత ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలోను కీ రోల్ ప్లే చేసింది. దాంతో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మూవీ మేకర్స్. ఫైనల్గా విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్గా సాలిడ్ బ్రేక్ అందుకుంది. అప్పటి నుంచి హీరోయిన్గా నిండుదనంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. దానికి కారణం గ్లామర్ షో చేయకపోవడం వల్లేనని ఇండస్ట్రీ టాక్.
రీతూవర్మ చేసింది కొన్ని సినిమాలే అయినా.. తన అందంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి.
రీతూ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో చీర కట్టులో చాలా అందంగా ఉంది రీతూ. కనిపించి కనిపించనట్టుగా అందాలను చూపిస్తూ.. కుర్రాళ్ల మతి పోగొట్టేసింది.
సంప్రదాయ దుస్తుల్లో స్లీవ్ లెస్ బ్లౌజ్లో ఈ తెలుగు అందం మరింతగా మెరిసిపోయింది. ఆ అందానికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. నిండు చీరకట్టులో చందమామలా కనిపిస్తోంది. వెన్నెల్లో కవ్విస్తున్నట్టుగా ఉన్న రీతూ వర్మ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇక చివరగా తెలుగులో శర్వానంద్ సరసన ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాలో నటించింది.