కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇటీవల ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రంగారెడ్డి డిఎంహెచ్వో స్వరాజ్య లక్ష్మి, DCHS ఝాన్సీ లక్ష్మి లపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మందిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు.
నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇటీవల…కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి..గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపు ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో, DCHSలపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.