తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ను సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ అంబేద్కర్ సచివాలయం లోని తన ఛాంబర్ లో జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. జూన్ 2న హైదరాబాద్ లోని గన్ పార్క్(Gun Park) వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం (Secretariat) ప్రాంగణంలో సీఎం జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయి. జూన్ 3 శనివారం నాడు ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు (Farmer’s Forums) కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా(Farmer’s Insurance) తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు. హైదరాబాద్ (Hyderabad) లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ (Tank bund) పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీ గురువారంహైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.