tarak ratna mother emotional:తారక్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన అన్నపూర్ణమ్మ
తారకరత్న ఆకాల మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోనీయడం లేదు. తారక్ కూతురు, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏమి తినకపోవడంతో భార్య అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చారు. ఈ రోజు ఫిల్మ్ చాంబర్లో ఉన్న తారక రత్న భౌతికకాయం వద్దకు తల్లి అన్నపూర్ణమ్మ వచ్చారు. నిర్జీవంగా ఉన్న తారక్‌ను చూసి వెక్కి వెక్కి ఏడ్చారు.
tarak ratna mother emotional:తారకరత్న (tarak ratna) ఆకాల మరణం ఆ కుటుంబాన్ని తట్టుకోనీయడం లేదు. తారక్ కూతురు, భార్య గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఏమి తినకపోవడంతో భార్య అలేఖ్యను (alekhya( ఆస్పత్రిలో చేర్చారు. ఈ రోజు ఫిల్మ్ చాంబర్‌కు తారక రత్న తల్లి అన్నపూర్ణమ్మ (annapurnamma) వచ్చారు. తారక్ పార్థీవదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఆమెను భర్త రామకృష్ణ (rama krishna) తీసుకువచ్చారు.
ఆ తల్లి కంట తడి ఆగలేదు. చివరి సారి కొడుకును చూసి రోదించారు. పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఆమెతోపాటు కూతురు కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం మహా ప్రస్థానం శ్మశాన వాటికలో తారకరత్న (taraka ratna) అంత్యక్రియలు జరుగుతాయి. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
‘ఒకటో నంబర్ కుర్రాడు’ మూవీ ద్వారా తారకరత్న హీరోగా తెలుగుతెరకు పరిచయం అయ్యాడు. ఆ సినిమా యావరేజీగా ఆడింది. 9 సినిమాలకు (9 movies) సైన్ చేసి చరిత్ర సృష్టించాడు. నటుడిగా సక్సెస్ కాలేకపోయాడు. రవిబాబు తీసిన ‘అమరావతి’ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు. ఆ తర్వాత ఆడపా దడపా సినిమాలు చేస్తూనే.. రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపించారు.
నారా లోకేశ్ (lokesh) యువగళం పాదయాత్రలో కదం తొక్కారు. దురదృష్టవశాత్తు ఆ యాత్ర తొలి రోజునే తారక రత్న కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో కుప్పం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూర్ తరలించారు. 23 రోజుల నుంచి నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. మెదడు సంబంధిత వ్యాధితో పోరాడి.. ఓడిపోయారు. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోయాడు.