Number Plates:రోడ్డు మీద వాహనాలు వెళ్తుంటే మనం రకరకాల నంబర్ ప్లేట్స్ (Number Plates) చూసి ఉంటాం. ఒక్కొక్కరు ఒకలా డిజైన్ చేసుకుంటారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కాకుండా మరోలా ఉంటాయి. అందుకు కారణం ట్రాఫిక్ పోలీసుల కంట కనబడకుండా ఉండేందుకే.. ఒక్కొక్కరు ఒకలా నంబర్ ప్లేట్లో (Number Plates) మూడు పెద్ద లెటర్స్ పెట్టి.. ఒకటి చిన్నగా పెడతారు. మరొకరు మరో లెటర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
తెలివిమీరిన కొందరు నంబర్ ప్లేట్‌కు మాస్క్ (mask) తొడుగుతారు. ఇలా ఒక్కొక్కరు ఒకవిధంగా చేస్తున్నారు. దీనిని ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. నంబర్ ప్లేట్ సరిగా లేకున్నా.. ట్యాంపరింగ్ చేసినా, వంచినా, నంబర్ కనబడకున్నా కేసులు నమోదు చేశారు. అంతేకాదు సదరు వాహన యజమానికి కోర్టులో (court) హాజరు పరుస్తున్నారు.
రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 49 వేల కేసులు (49 thousand cases) నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ గత 5 నెలల కాలంలోనే ( 5 months) ఫైల్ అయిన కేసులు అని అధికారులు తెలిపారు. నంబర్ ప్లేట్ (Number Plate) ట్యాంపరింగ్‌లో ఫస్ట్ టైమ్ దొరికితే సరిచేసుకోవాలని కోరుతున్నారు. రిపీట్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
రెండో సారి దొరికిన వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అలా ఆరుగురు నిందితులకు కోర్టు 3 నుంచి 5 రోజుల జైలు శిక్ష (prison), జరిమానా కూడా విధించింది. వీరిలో ఒకరికి రూ.5 వేల ఫైన్ కూడా వేసింది.