ప్రస్తుతం కేటీఆర్ మరియు కవిత సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) సంబంధించిన వ్యవహారం వార్తల్లో హైలైట్ గా నిలుస్తోంది. మనీలాండరింగ్ కేసు(Money laundering case)లో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై (Tamilisai) సౌందరరాజన్‌కు లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్(Minister KTR) సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీ (ED)కి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని ఆయన వెల్లడించారు.
తన వద్ద రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్ తరపు వారికి ఇచ్చానని తెలిపాడు. ఈ అంశాలపై సీబీఐ (CBI) దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్ (MLA Raja Singh) మరోవైపు సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా నాకు తెలియదని అని కేటీఆర్ క్లారీటీ ఇచ్చారు