తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ (Rakhi festival) నాడే ఓ చెల్లెలు అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ సోదరికి కన్నీరే మిగిలింది. పండగ పూట ఆ ఇంట్లో విషాదం అలముకుంది. హార్ట్ ఎటాక్(Heart attack)తో తోడబుట్టినవాడు కుప్పకూలడంతో కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే అన్న మృతదేహానికి (dead body)రాఖీ కట్టడం చూసి గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా (Peddapally district) ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఈ విషాదం ఘటన చోటుచేసుకుంది.దీంతో రక్షాబంధన్ నాడే ఇంతటి బాధను అనుభవించాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆ చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించింది.
అన్నా.. ఇదే నీకు కట్టే చివరి రాఖీ.. సోదరుడి మృతదేహాన్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించిన చెల్లెలు(Sister)మాటలకందని విషాదం అది! తోడబుట్టిన అన్నాదమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లు కోరుకునే పవిత్రమైన రాఖీ పండుగ నాడే ఓ చెల్లెలు.. తన అన్నకు తుది వీడ్కోలు పలకాల్సి వచ్చింది. దీంతో రక్షాబంధన్ నాడే ఇంతటి బాధను అనుభవించాల్సి వస్తుందని ఊహించలేదంటూ ఆ చెల్లెలు కన్నీరు మున్నీరుగా విలపించింది.
తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అన్నకు.. చివరిసారిగా రాఖీ కట్టి గుండెలవిసేలా రోదించింది. ధూళికట్ట(Dhulikatta)గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాఖీ పండగ సందర్భంగా కనకయ్య సోదరి గౌరమ్మ అన్న ఇంటికి వచ్చింది. సోదరుడికి (Brother) రాఖీ కట్టి వెళదామని వచ్చిన గౌరమ్మ.. అన్న హఠాన్మరణంతో గుండెలవిసేలా రోదించింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోయింది. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది.