ప్రియుడి(boyfriend)ని పెళ్లాడేందుకు కూతురిని అమ్మేసింది ఓ కసాయి తల్లి. ఈ ఘటన బీహార్(Bihar)లోని ముజఫర్‌పుర్‌లో జరిగింది. జార్ఖండ్ రాజధానికి రాంచీ(Ranchi)కి చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం ముజఫర్‌పుర్‌కు కొన్నేండ్ల క్రితం వలసొచ్చారు. అయితే భర్త రెండేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఇంటి పక్కనే ఉన్న ఓ యువకుడితో ఆ మహిళ ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి(Wedding) చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే సంతానంతో వస్తే వివాహం చేసుకునే ప్రసక్తే లేదని ఆ వ్యక్తి తేల్చిచెప్పాడు. దీంతో తన ఇంటికి సమీపంలో ఉండే దంపతుల సహాయంతో నిందితురాలు తన కుమార్తె(మైనర్)ను ఓ వ్యాపారవేత్త(35)కు విక్రయించింది.
కుమారుడిని ఓ ప్రయివేటు విద్యా సంస్థ హాస్టల్(Hostel)లో వదిలేసి ఢిల్లీ వెళ్లిపోయింది. హాస్టల్ వద్ద ఎలాంటి ఫీజులు చెల్లించకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. బాలుడి తాత, మామయ్య కలిసి నిందితురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక (Girl) ఆచూకీని కనుగొన్నారు. వ్యాపారవేత్తను, బాలిక విక్రయంలో సహకరించిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని, ఆమె ప్రియుడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు (Police) యత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో సహాయం చేసిన పొరుగింటి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ మహిళను, ఆమె ప్రియుడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.