నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్ (Nadimetla Sridhar) నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్ఎండీసీ(NMDC) చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సింగరేణి సీఎండీగా (Singareni CMD) కొనసాగుతున్నారు.
నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) చైర్మన్‌గా నడిమెట్ల శ్రీధర్ (Nadimetla Sridhar) నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలెక్షన్ బోర్డు ఎన్ఎండీసీ(NMDC) చైర్మన్‌గా నియమించాలని సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన సింగరేణి సీఎండీగా (Singareni CMD) కొనసాగుతున్నారు. శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు.
మొదట రాజమండ్రి (Rajahmundry) సబ్ కలెక్టర్‌గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా,(ITDA PO) పోర్ట్స్ డైరెక్టర్‌గా కాకినాడలో పని చేశారు. అనంతరం అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రెటరీగా మూడేళ్ల మూడు నెలల పాటు పని చేశారు. తెలంగాణ (Telangana) ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్ లిమిటెడ్ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు.