హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో రోడ్డు భారీగా కుంగిపోయింది. 10 అడుగుల మేర రోడ్డు కుంగింది. ఒక్కసారిగా రోడ్డు మీద గుంత పడటంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు అందులో చిక్కుకున్నారు. రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతలో ఒక ట్రక్కు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.