Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికీ లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తొలి రౌండ్ నుంచే సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే కొడంగల్ నుంచి బరిలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ విజయంపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ‘కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా’.. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతానని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.