»Rains For Two More Days Yellow Alert For Those Districts
Heavy rains : రెండు రోజులు విస్తారంగా వర్షాలు… ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ (Department of Meteorology)హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది .ఉత్తర తెలంగాణలో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు అవకాశం ఉంది. రేపటి నుండి చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తోండగా.. మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశముంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఇక 24వ తేదీ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, (thunder)మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది. ఈ నెల 25, 26వ తేదీల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్(Hyderabad) లో చిరు జల్లులు పడే అవకాశముందని అంచనా వేసింది. మరోవైపు ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి పంటకు భారీగా నష్టం వాటిల్లింది. తాజాగా మరోసారి వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రైతుల్లో (farmers) ఆందోళన నెలకొంది.