»Key Steps Towards Green Hyderabad Committee Green Signal For 23 Issues
GHMC : పచ్చని హైదరాబాద్ దిశగా కీలక అడుగులు…23 అంశాలకు కమిటీ గ్రీన్ సిగ్నల్
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ(Mayor Gadwal Vijayalakshmi) అధ్యక్షతన స్టాండింగ్ కమీటీ సమావేశం (Standing Committee Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలోమొత్తం 23 అంశాలకు సభ్యులు ఆమోదించారు. అందులో పలు SRDP కింద రోడ్డు వెడల్పు కార్యక్రమాలకు కమిటీ ఆమోదం తెలిపింది. ఒక టేబుల్ ఐటమ్ అప్రూవ్డ్ అయింది. ఎంవోయూలకు, టెండర్లకు, పరిపాలనా అనుమతులకు కమిటీ ఆమోదం తెలిపింది.

స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలు
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్లో(Serilingampally Zone) గచ్చిబౌలి నుంచి GPRS క్వార్టర్స్ మీదుగా బ్రహ్మకుమారి సర్కిల్ 20లో గల సెంట్రల్ మీడియన్ సుందరీకరణ కోసం మూడేళ్ల పాటు జనవరి 2023 నుండి డిసెంబర్ 2025 వరకు గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తమ సొంత నిధులు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. నిర్వాహకులతో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ MoU చేసుకునేందుకు అనుమతికి కమిటీ ఆమోదం. రోడ్డు డెవలప్మెంటులో బాగంగా 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు గాను ఖాజా మేన్షన్ ఫంక్షన్ హాల్ అప్రోచ్ రోడ్ నుంచి అహ్మద్ నగర్, ధనబాల రెసిడెన్సీ నుంచి సరోజినీదేవి రోడ్డు (Sarojini Devi Road) వరకు లింక్ రోడ్డు ఏర్పాటుకు 178 ఆస్తులు సేకరణకు కమిటీ ఆమోదం.
డిసెంబర్ 2022 ఆదాయ వ్యయాలను చీఫ్ ఎగ్జామినర్ అకౌంట్స్ కమిటీ తెలియజేసి ఆమోదం పొందారు. రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కింద హెరిటేజ్ బిల్డింగ్ నుంచి భారతీయ విద్యాభవన్ 12 మీటర్ల రోడ్డు, హెరిటేజ్ బిల్డింగ్ నుంచి కింగ్ కోఠి (King koti) వరకు, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్ నుంచి కింగ్ కోఠి వరకు ప్రతిపాదిత రోడ్డు వెడల్పు కోసం 29 ఆస్తులు సేకరణకు కమిటీ ఆమోదం.ఎన్ఐఏ నుంచి డిసిసి క్రికెట్ గ్రౌండ్ వరకు రోడ్డు వెడల్పునకు 14 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం.రెయిన్ బజార్ (Rain bazar) చమన్ నుంచి అనుమోల్ హోటల్ ఫతేష నగర్ జంక్షన్ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 136 ఆస్తుల సేకరణలకు కమిటీ ఆమోదం. SRDP ద్వారా పాత చత్రినాక పోలీస్ స్టేషన్ నుంచి ఉప్పుగూడ (Uppuguda) మహంకాళి టెంపుల్ వరకు రూ.2.50 కోట్ల వ్యయంతో 60 ఫీట్ల CC రోడ్డుతో పాటుగా ఫుట్ పాత్ నిర్మాణానికి కమిటీ ఆమోదం.