Tomorrow కరీంనగర్‌కు సీఎం కేసీఆర్.. వరంగల్, ఖమ్మం జిల్లాలకు కూడా
Cm kcr:సీఎం కేసీఆర్ (Cm kcr) రేపు కరీంనగర్ (karimnagar) జిల్లాలో పర్యటిస్తారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీపూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వ ఆదేశాలతో గ్రామాల్లో పర్యటించి అధికారులు నివేదిక సిద్దం చేసిన సంగతి తెలిసిందే.

జిల్లాలో వరి, మామిడి, మిరప, మక్క, టమాటో పంటలకు నష్టం వాటిల్లింది. మక్క పంట కోత సమయంలో కిందపడిపోయింది. యంత్రాలతో కోయలేని పరిస్థితి ఏర్పడింది. రామడుగు మండలంలో పంటను కేసీఆర్ పరిశీలించి.. రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాతోపాటు వరంగల్ (warangal), ఖమ్మం (kammam) జిల్లాలకు కూడా సీఎం కేసీఆర్ (kcr) వెళతారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. ఇప్పటికే మంత్రులు ఆయా జిల్లాల్లో పంట నష్టాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (dayakar rao) తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 వేల ఎకరాల్లో (21 thousand acres) పంట దెబ్బతిందని టీఎస్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (vinod kumar) తెలిపారు. 18 వేల మంది బాధిత రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రక్రియ వేగవంతం చేస్తారన్నారు.