»Priyanka Gandhi To Telangana Today Face To Face With Women
Priyanka Gandhi : నేడు తెలంగాణకు ప్రియాంక గాంధీ..మహిళలతో ముఖాముఖి
ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులు టైం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. మరోసారి తెలంగాణకు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) రానున్నారు. కొల్లాపూర్ (Kolhapur) నియోజవర్గ కేంద్రంలో నిర్వహించే పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం దేవరకద్ర నియోజకవర్గంలో ప్రియాంక పర్యటన రద్దయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పాదయాత్రలు, సభలు, బస్సు యాత్ర చేపట్టి తమ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక బస్సు యాత్రను కాంగ్రెస్ (Congress) అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రారంభించింది. అయితే ఇప్పుడు మరోసారి ప్రియాంక రాష్ట్రానికి రానున్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షించనున్నారు.ఉమ్మడి పాలమూరు (Palamuru) జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరి సభకు వెళ్లి అక్కడ ప్రసంగిస్తారు. పీసీసీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రియాంక ప్రచారం చేయనున్నారు.అలాగే నవంబర్ ఒకటి, రెండు తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో పర్యటిస్తారు. 1వ తేదీన కల్వకుర్తి, జడ్చర్ల షాద్నగర్ సభల్లో ఆయన పాల్గొంటారు. నవంబర్ 2వ తేదీన మేడ్చల్, మల్కాజ్గిరి(Malkajgiri), కుత్బుల్లాపూర్ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ తొలివిడత యాత్రకు మంచి స్పందన వచ్చిందని.. ఈ యాత్రను కూడా విజయవంతం అవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.