»Mla Ticket For Transgender Bsp Released The Second List With 43 People
BSP: ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్..43 మందితో రెండో జాబితా రిలీజ్ చేసిన బీఎస్పీ
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఓ ట్రాన్స్ జెండర్‌కు కూడా బీఎస్పీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నాయి. బీఎస్పీ పార్టీ కూడా తమ అభ్యర్థుల మొదటి జాబితాను ఇదివరకే ప్రకటించింది. తాజాగా తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ తరుణంలో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చి అందరి చేతా ప్రశంసలు పొందుతోంది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో బిఎస్పీ మొదటి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఆ 43 మందిలో 26 మంది బీసీలు, 7 మంది ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలకు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్లు కేటాయిస్తూ ప్రకటన చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.