తెలంగాణ ప్రజల సొమ్ముతో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర(Maharashtra)లో బందిపోట్ల సోకు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు.కేసీఆర్ తెలంగాణ(Telangana)కు సీఎంహా మహారాష్ట్రకు అంటూ బండి విమర్మించారు. రిటైర్డ్ ఐపీఎస్ జయచంద్రను కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బండి సంజయ్(Bandi Sanjay). రబ్బరు స్టాంపు మాదిరి ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్ కు నచ్చుతారని విమర్శలు చేశారు. నిజాయితీగా ఉండే గవర్నర్ (Governor) అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆగ్రహించారు. గవర్నర్ ను హేళనకు చేయటం రాజ్యాంగాన్ని అవమానించటమేనంటూ ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ (BRS) చేస్తోన్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ (Pragati Bhavan) తాగి తినటానికి మాత్రమే సీఎం ఉపయోగించుకుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్.. ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. సీఎంవో (CMO) లో కొంతమంది తీరు సీఎం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉందని బండి విమర్శలు చేశారు. రిటైర్డ్ అయిన 500 మంది అధికారులను అడ్డుపెట్టుకుని ఏటా రూ.వెయ్యి కోట్లు సంపాదించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఈ చివరి ఘడియల్లో నైనా ఆ అధికారులు ఆలోచనను మార్చుకుని తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేయాలని బండి సంజయ్ కోరారు.