• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

MLC Kavitha : మేనల్లుడిపై కవిత ప్రశంసల వర్షం… కారణమేంటో తెలుసా?

MLC Kavitha : మంత్రి కేటీఆర్ కుమారుడు, మేనల్లుడు హిమాన్షుపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు. హిమాన్షు ఇటీవల ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. కాగా..... హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కవిత ఆనందం వ్యక్తం చేశారు. అదరగొట్టావ్ అల్లుడు అంటూ కవిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

February 18, 2023 / 11:07 AM IST

SI exam : ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపే ప్రాథమిక రాత పరీక్ష

ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు రేపు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష(written exam) జరగనుంది. నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వం ఇప్పటికే పలు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి కూడా పూనుకుంది.. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

February 18, 2023 / 10:29 AM IST

Hyderabad: అర్ధరాత్రి ఫ్లై ఓవర్లు బంద్.. ఎందుకో తెలుసా?

శివరాత్రి, జగ్ నే కీ రాత్ కి ఆయా వర్గాలు జాగరణ చేస్తారు. భగవన్నామస్మరణలో మునిగి ఉంటారు. ఈ సందర్భంలో కొందరు ఊరేగింపులు చేసే అవకాశం ఉంది. అయితే అత్యంత వేగంగా ఫ్లై ఓవర్లపై నుంచి కొనసాగితే ప్రమాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నారు. కాగా ఆదివారం తెల్లవారుజాము తర్వాత తిరిగి ఫ్లై ఓవర్లు తెరచుకుంటాయి.

February 18, 2023 / 10:14 AM IST

SR NAGAR : రూ. 7 కోట్ల విలువైన నగలతో కారు డ్రైవర్ పరారు

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ (SR NAGAR) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ కారు డ్రైవర్ (Car driver) రూ. 7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. మాదాపూర్‌లోని మైహోం (Myhomes) భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు.

February 18, 2023 / 09:21 AM IST

Tammaneni : కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించే లక్ష్యంతో పోరాటాలు చేస్తాం : సీపీఎం

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (Bjp) వ్యతిరేక శక్తులను ఏకం చేసి పోరాటాలకు సన్నద్దం అవుతామని సీపీఎం (Cpm) రాష్ట్ర కార్యదర్మి తమ్మనేనీ (Tammanēnī) వీరభద్రం అన్నారు. ప్రతి పక్షనాయకుల, సంస్థలపై, వ్యక్తులపై ఈడి, (ED) సీబీఐ (CBI) దాడులు జరుగుతున్నాయి

February 18, 2023 / 08:14 AM IST

Investigation :హైదరాబాద్‌‌లో పేలుళ్లకు కుట్ర కేసు దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్ (Hyderabad) లో పేలుళ్లు (Explosions) కుట్ర కేసు దర్యాప్తు సిటీ పోలీసులు (City police) వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించిన అబ్దుల్ కలీం( Abdul Kalim) ను అరెస్ట్ చేసి ప్రశ్నించారు. గతంలో పేలుళ్ల కేసులో కలీమ్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. దసరా (Dasara) ఉత్సవాల సందర్భంగా నరమేధానికి ప్లాన్ చేశాడు.

February 18, 2023 / 07:28 AM IST

Maha Shivaratri 2023: హర హర శంకరా.. పోటెత్తిన భక్తులు

దేశవ్యాప్తంగా ఉన్న జ్యోతిర్లింగాలలో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాశీ విశ్వనాథ్, సోమ్ నాథ్, కాళేశ్వరం, వేములవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివునికి మహాప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రోజున బిల్వార్చకం, రుద్రాభిషేకాలు భక్తులు చేశారు.

February 18, 2023 / 08:02 AM IST

green signal : పాలమూరు-రంగారెడ్డిప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

పాలమూరు-రంగారెడ్డి ( Palamuru-Rangareddy) ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.సుప్రీంకోర్టులో తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ఊరట లభించింది.

February 17, 2023 / 09:49 PM IST

MLAs bait case : ఎమ్మెల్యేల ఎర కేసు..వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

బీఆర్‌ఎస్ (BRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసుని సుప్రీం కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.! అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు (CBI) సీబిఐ కి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీం కోర్టు తలుపు తట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)ఈ నెల 8న విచారణ చేపట్టింది.

February 17, 2023 / 09:47 PM IST

Harish Rao : కేంద్ర ప్రభుత్వం పై మంత్రి హరీష్‌ రావు పైర్

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి మెడికల్‌ కాలేజీల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి హరీష్‌ రావు( harish rao) అన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పడంపై ఆయన కేంద్రపై ధ్వజమెత్తారు.

February 17, 2023 / 09:13 PM IST

himanshu golden hour cover song:యూట్యూబ్‌లో షేర్ చేసిన హిమాన్ష్.. గర్వంగా ఉంది:కేటీఆర్

himanshu golden hour cover song:మంత్రి కేటీఆర్ (ktr) తనయుడు హిమాన్షు (himanshu) తన ప్రతిభను చాటుతున్నారు. ఓ పాప్ గీతానికి (pop song) కవర్ సాంగ్ (cover song) చేశారు. అమెరికన్ సింగ్ జేవీకేఈ రూపొందించిన గోల్డెన్ అవర్ సాంగ్‌కు కవర్ సాంగ్ చేసి తన యూట్యూబ్ చానల్‌లో షేర్ చేశారు. ఇదే తన తొలి కవర్ సాంగ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. కవర్ సాంగ్‌పై మంత్రి కేటీఆర్ (ktr) సంతోషం వ్యక్తం చేశారు.

February 17, 2023 / 08:45 PM IST

10 double decker buses:సిటీలో అందుబాటులోకి మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై మూడు డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిక్స్ షో సందర్భంగా ఈ నెల 7వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అయితే మరో 10 డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని ఆర్టీసీ తెలిసింది. మెట్రో రూట్, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలు లేని చోట వీటిని నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.

February 17, 2023 / 08:21 PM IST

Zoom hi-tech scooter : తెలంగాణలో జూమ్ హైటెక్ స్కూటర్ లాంచ్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ( hero)మోటోకార్ప్' (MotoCorp) తాజాగా జూమ్ హైటెక్ స్కూటర్ ను తెలంగాణ (Telangana) లో విడుదల చేసింది.ఇది 110 సీసీ స్కూటర్. మరే స్కూటర్ కు లేని విధంగా దీంట్లో తొలిసారిగా కార్నర్ బెండింగ్ లైట్స్ అమర్చారు.

February 17, 2023 / 07:08 PM IST

ys sharmila:శంకర్ నాయక్ సైగ చేయ్యు చుద్దాం.. వైఎస్ షర్మిల అటాక్

ys sharmila:ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై (shankar naik) వైఎస్ఆర్ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) విరుచుకుపడ్డారు. తను మానుకోట వచ్చేసరికి ఎమ్మెల్యేకు భయం పట్టుకుందన్నారు. శంకర్ నాయక్ (shankar naik) సైగ చేయ్యు చూద్దాం ఎవడు వస్తాడో చూస్తానని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

February 17, 2023 / 05:35 PM IST

Marijuana: రాగి కంకుల్లో గంజాయి తరలింపు..బుక్కైన నిందితులు

సీక్రెట్ బాక్సులో రాగి కంకులు పైన పెట్టి కింద గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 23 కిలోలలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్ పరిధిలో చోటుచేసుకుంది.

February 17, 2023 / 04:21 PM IST