HNK: హన్మకొండ DMHO కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కే.వేణుగోపాల్‌కి పదోన్నతి లభించింది. ఈ క్రమంలో ఆయన MHBD జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ అయ్యారు. బుధవారం ఆయనకు అధికారులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. DMHO డా.అప్పయ్య, వైద్యసిబ్బంది కార్యక్రమంలో పాల్గొని వేణుగోపాల్‌ను శాలువాతో సత్కరించి, అభినందించారు.
KMR: ప్రతిరోజు వందలాది మంది రాకపోకలతో నిత్యం కళకళలాడే KMR మున్సిపల్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడుల తర్వాత బుధవారం ఒక్కసారిగా జన సంచారం తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో పలు రకాల పనుల నిమిత్తం వందలాదిగా వచ్చే జనాలు ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది.
JN: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ బచ్చన్నపేట మండలంలోని హోటళ్లు, దాబాలపై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి, పలు సిలిండర్లను సీజ్ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోటళ్లలో కేవలం 3 కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలన్నారు.
KMM: ముదిగొండ మండలంలొ పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసిందని ఎంఈవో రమణయ్య తెలిపారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 516 మంది విద్యార్థులకు గాను 515 మంది హాజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు,విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బుధవారం దాదాపు 100 మంది ముస్లిం సోదరులకు రంజన్ కిట్లును పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆరు రకాల వస్తువులతో పాటు బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు.
BHNG: మోటకొండూర్ మండల కేంద్రంలో పోలీస్ బృందం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పక్కన బుధవారం చలివేంద్ర కేంద్రాన్ని ఎస్సై డీ.అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు పట్టణ ప్రజలకు ఈ యొక్క కేంద్రం చాలా ఉపయోగపడుతుందని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.
WNP: పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం తక్కువ వ్యవస్థలో స్థిర ఉపాధి కోరుకునే వారికి హ్యాండ్లూమ్, టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సుల ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. హైదరాబాదులోని కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 2026 మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు.
PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 99.9% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి శారద ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 7489 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 7480 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 9 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం జిల్లా స్థాయి సలహా కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని అన్నారు. జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 35,29,000 విలువైన సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి ఒక గొప్ప భరోసా అని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విడతల వారీగా మరిన్ని ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.
BHNG: రామన్నపేట పట్టణ కేంద్రంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్లో జిల్లా ఎస్పీ విష్ణుమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. పంతంగి టోల్గేట్ వద్ద తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 60 కిలోల గంజాయిని సీజ్ చేసి, ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల అరెస్టు చేశారు. దీని విలువ సుమారు రూ.33లక్షలు ఉంటుందని వెల్లడించారు.
SRCL: ఆన్సైట్ ఎఫ్ఐఆర్ జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామన్నారు.
MHBD: సీరోల్ మండలం ఉప్పరిగూడెం గ్రామ స్టేజి వద్ద బుధవారం రోడ్డు దాటుతున్న మహిళను టిప్పర్ లారీ ఢీకొనడంతో నాగేటి పద్మ (50) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాలలో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే పండుగ ఉగాది అన్నారు.