• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Eatala Rajender: ఈ ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చుపెట్టలేను!

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేత, హుజురాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క రూపాయి కూడా తాను ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని ఈటల అన్నారు. అంతేకాదు ప్రస్తుతం తన వద్ద ధైర్య లక్ష్మి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు పలురకాలుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

November 15, 2023 / 05:31 PM IST

TS POLLS: భారీగా నామినేషన్ల విత్ డ్రా.. గజ్వేల్‌లోనే 58 మంది

తెలంగాణ రాష్ట్రంలో భారీగా నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. రెబల్స్, ఇండిపెండెంట్ అభ్యర్థులను బుజ్జగించడంలో ప్రధాన పార్టీలు సక్సెస్ అయ్యాయి.

November 15, 2023 / 05:08 PM IST

Revanth Reddy: కాంగ్రెస్‌ వస్తే 24 గంటల ఉచిత విద్యుత్..ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటా: రేవంత్

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో నేడు కాంగ్రెస్ విజయభేరి సభ జరిగింది. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బోథ్ ప్రాంతానికి నీళ్లు రాకపోవడానికి కారణం సీఎం కేసీఆర్ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు.

November 15, 2023 / 03:28 PM IST

EC : తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు తనిఖీలే.. పంపకాలు పంపకాలే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో నగదు, బంగారం, ఇతర రూపంలో అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 538.23 కోట్లకుపైగా ఉన్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు

November 15, 2023 / 01:02 PM IST

Madhu Yashki ఇంట్లో అర్ధరాత్రి సోదాలు.. కాంగ్రెస్ నేత సీరియస్

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ ఇంట్లో అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు సోదాలు జరిపారు. వారితో మధుయాష్కీకి తీవ్ర వాగ్వివాదం జరిగింది.

November 15, 2023 / 11:45 AM IST

VRA : మూడు నెలలుగా జీతాలు లేక వీఆర్ఏల అవస్థలు

కొద్ది నెలలుగా జీతాలు లేక తెలంగాణలోని వీఆర్ఏలు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. తమకు ఇప్పటికే రెండు, మూడు నెలల నుంచి జీతం రావడం లేదని..ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇప్పట్లో తమకు జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.

November 15, 2023 / 11:39 AM IST

Telangana: మందు పార్టీ చేసుకునేవారికి అలర్ట్.. ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన

తెలంగాణ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తుంటే కచ్చితంగా రూ.100 బాండ్ పేపర్‌పై హామీ పత్రం రాసి ఇవ్వాలని, వారికి మాత్రమే మద్యం అనుమతి ఉంటుందని తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండే వరకూ మద్యం పార్టీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అనుమతి ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.

November 14, 2023 / 07:48 PM IST

Revanth Reddy: కేసీఆర్‌ వంద తప్పులు పూర్తయ్యాయి..ఇక అంతమే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ రణరంగం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీకి ధీటుగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పర్యటించిన క్రమంలో సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ 100 తప్పులు ఇప్పటికే పూర్తయ్యాయని రేవంత్ ఎద్దేవా చేశారు.

November 14, 2023 / 07:22 PM IST

Babu, YSR కలిపితే కేసీఆర్: మంత్రి కేటీఆర్

చంద్రబాబు, వైఎస్ఆర్ కలిపితే కేసీఆర్ అవుతారని.. ఆ ఇద్దరిలోని నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.

November 14, 2023 / 04:15 PM IST

TS Polls: టీ, బిర్యానీ, పూల ధరలకు రెక్కలు.. ఎందుకంటే..?

ఎన్నికల వేళ టీ, బిర్యానీ, బైక్, బస్ రెంటల్, పూల ధరలకు రెక్కలు వచ్చాయి. వాటితో అవసరం కాబట్టి.. ధర ఎంతయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు.

November 14, 2023 / 03:31 PM IST

Raja Singh: పదేళ్ల పిల్లాడి ఫేవరెట్ లీడర్, ఫిదా అయిన ఎమ్మెల్యే

పదేళ్ల పిల్లాడి ఫేవరెట్ లీడర్ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజా సింగ్ అట.. ఓ ఇంటర్వ్యూలో చెప్పగా.. వీడియో చూసిన రాజా సింగ్.. ఆ పిల్లాడిని తనకు ఎవరైనా కల్పించాలని కోరారు.

November 14, 2023 / 02:48 PM IST

BRS ఎమ్మెల్యేకు నిరసన సెగ..మా ఊరికి రావొద్దు అడ్డుకున్న గ్రామస్తులు

రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా.. ప్రచారం చేయడానికి వీళ్లేదంటూ అడ్డు తగిలారు.

November 14, 2023 / 01:24 PM IST

Pranavను హుజురాబాద్ పంపింది కేసీఆరే.. ఈటల జమున సంచలన వ్యాఖ్యలు

హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించాలని సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఈటల భార్య జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబును రంగంలోకి దింపారని ఆరోపించారు.

November 14, 2023 / 01:01 PM IST

RSP : రూ.25 వేలు చోరీ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై కేసు నమోదు

సిర్పూర్ నియోజకవర్గ వర్గంలోని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

November 14, 2023 / 11:55 AM IST

Harish ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కేటీఆర్‌ను సీఎం చేసిన ఓకేనట..?

కేటీఆర్ సీఎం పదవీ చేపట్టిన తనకు అభ్యంతరం లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిరిగా తమ పార్టీలో కుమ్ములాటలు ఉండవని తేల్చిచెప్పారు.

November 14, 2023 / 11:20 AM IST