MNCL: జన్నారం మండలంలోని మురిమడుగు అనుబంధ కూర్మపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి వృధాను అరికట్టాలని ఆ గ్రామస్తులు కోరారు. ఆ గ్రామంలోని మిషన్ భగీరథ పైప్ లైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోతుందని వాపోయారు. ఒకవైపు మిషన్ భగీరథ నీరు రావడం కష్టంగా ఉందని, ఈ సమయంలో ఉన్న నీటిని వృధా చేయడం సరికాదన్నారు. ఆ పైప్ లైన్లకు మరమ్మతులు చేయించాలని వారు కోరారు.