HYD: బాలాజీ నగర్ డివిజన్ రెయిన్ బో విస్టాస్ వద్ద ఏర్పాటు చేస్తున్న మురుగునీటి శుద్ధి కర్మాగారం (STP) పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ బాబురావుతో కలిసి పరిశీలించారు. గత రెండు ఏళ్లుగా STP నిర్మాణ పనుల జాప్యానికి అధికారులే కారణమని.. అధికారులు సమన్వయం చేసుకొని త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.