వరంగల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో చోటు చేసుకుంది. మండల కేంద్రం చెందిన ఆవుల సతీష్ తన ద్విచక్ర వాహనంపై అంబేద్కర్ సర్కిల్లో యూటర్న్ తీసుకుంటుండగా వెస్ట్ గోదావరి కొబ్బరి బొండాల లోడుతో వరంగల్ వైపు వెళ్తున్న టాటాఏసీ వాహనం ఢీ కొట్టింది. సతీష్‌కు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.