KMR: యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కుర్లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన హరీశ్ (19) వారి పాత ఇంట్లో నిద్రించాడు. మంగళవారం ఉదయం అతడి తండ్రి తలుపు తెరిచి చూసేసరికి ఉరేసుకొని కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.