ADB: ప్రజలు నమ్మకంతో కట్టబెట్టిన తమ పదవులకు న్యాయం చేయాలని బోథ్ ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. ఇవాళ బోథ్ మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో వారి యొక్క పాత్ర, విధులు, బాధ్యతలు గురించి వివరించారు.
GDWL: కేటిదొడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ నారాయణ రైతుల పొలాలకు వెళ్లే దెబ్బతిన్న బాటను బాగు చేయించారు. వర్షాల వల్ల చెడిపోయిన మార్గాన్ని మరమ్మతు చేసి రాకపోకలు సులభం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ హనుమంతు, మండల అధ్యక్షుడు ఉరుకుందు పాల్గొన్నారు. రైతులు పంచాయతీకి కృతజ్ఞతలు తెలిపారు.
SRD: కోహీర్ మున్సిపాలిటీలో 16 రోజుల నుంచి కమిషనర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద వారు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణం బాగోగులు పట్టించుకునే అధికారి లేకపోవడంతో తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని నాయకులు ఆగ్రహంతో అన్నారు. ఇప్పటికైనా కమిషనర్ విధులకు హాజరవ్వాలన్నారు.
MLG: కాకులమర్రి లక్ష్మణ్ బాబు–శ్రీలత దంపతులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రామాలయం వద్ద వెలసిన ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాన్ని పూర్తిగా తమ సొంత నిధులతో నిర్మిస్తామని తెలిపారు.
HNK: ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడి గల్లంతైన భీమారం వాసి సాంబయ్య మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం గుండ్లసింగారం వద్ద ప్రమాదవశాత్తు కాలువలో పడి ఆయన కొట్టుకుపోయారు. కేయూసీ సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, పలువేల్పుల ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు.
NRPT: దామరగిద్ద మండలంలోని కానుకుర్తి గ్రంథాలయానికి శాశ్వత భవనం మంజూరు చేయాలని సర్పంచ్ ఎన్. నారాయణ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వార్ల విజయ్‌కుమార్‌ను కోస్గిలో కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఛైర్మన్ ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని గిర్నీబావిలో BRS పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభ బండ్లను EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లక్ష్మీ నరసింహస్వామి కృపతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాల్సిందిగా స్వామి వారిని కోరుకున్నారు. జాతర వచ్చే భక్తులకు త్రాగునీరు అధికారులను అందించాలని కోరారు.
JN: జనగామ పట్టణ 3వ వార్డులో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రజలు రాత్రి వేళల్లో ఇబ్బందులు పడుతున్నారని 3వ వార్డు కౌన్సిలర్ జ్యోతి మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వెలగని వీధి దీపాలను రిపేర్ చేసి కొత్త లైట్లు అమర్చాలని, కరెంట్ పోల్స్, పైపులకు కొత్త క్యాప్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకుడు గోపి పాల్గొన్నారు.
MHBD: మరిపెడ మండలంలోని బాలుర ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు అన్నారు. మరిపెడలో ముఖ్య నేతల సమావేశంలో జ్యోతిబసు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
వరంగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలల్లో కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. స్వయంభూగా వెలసిన స్వామివారు ఈప్రాంత భక్తుల ఆరాధ్య దైవంగా కొలువుదీరారు. అపాయాల నుంచి గ్రామాన్ని కాపాడే రక్షకుడిగా నరసింహుడిని స్థానికులు అమితంగా విశ్వసిస్తారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ క్షేత్రంలో ఏటా నిర్వహించే జాతరకు భక్తులు పోటెత్తుతారు.
NGKL: తెలకపల్లి మండల పరిధిలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ ఎంతో ఉత్సాహంగా జరిగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అని ప్రధానోపాధ్యాయులు మల్లేష్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని అన్నారు.
BHPL: మల్హర్ మండలం మల్లారం గ్రామంలో బొగ్గు రవాణా వాహనాలను గ్రామస్థులు బుధవారం అడ్డుకున్నారు. తాడిచర్ల నుంచి భూపాలపల్లికి వెళ్తున్న లారీలను నిలిపివేసి రోడ్డుపై నిరసన తెలిపారు. లారీల ఓవర్ లోడు కారణంగా గ్రామంలోని రహదారి పూర్తిగా కృంగిపోయిందని, ప్రయాణం నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
NLG: చిట్యాల మండలం ఏపూరు గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. యువత భవిష్యత్తు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్ పాలెం మహేష్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. రేపటి నుంచి గ్రామంలో ఎలాంటి మద్యం, మత్తు పానీయాల విక్రయాలు జరపబోమని నిర్వాహకులు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.
KMM: లైన్ మెన్ దినోత్సవం సందర్భంగా బుధవారం నేలకొండపల్లి మండల విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ రవి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలకు తెగించి ప్రజలకు నిరంతర విద్యుత్ అందిస్తున్న లైన్ మెన్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.విధి నిర్వహణలో వారు చూపుతున్న అంకితభావం అభినందనీయమన్నారు.
KMR: బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మ్యాథ్స్, బొటనీ, పొలిటికల్ సైన్స్, తదితర పరీక్షలు జరిగినట్లు అధికారులు తెలిపారు. 282 మంది విద్యార్థులకు 278 మంది హాజరు కాగా నలుగురు గైర్హాజరైనట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.