KMM: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో వివిధ దేశాలపై దాడులు కొనసాగించడం తప్పుడు చర్య అని CPM జిల్లా నాయకులు నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా గురువారం ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వందలాది మంది ప్రజలను హత్య చేయడం వంటి దుర్మార్గపు చర్యలను ఆపాలని పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4306 మంది హాజరు కావలసి ఉండగా, 4176 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 130 మంది గైర్హాజరు కావడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు.
NLG: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యాచరణపై చిట్యాల మున్సిపల్ ఆఫీస్‌లో ఛైర్ పర్సన్ పందిరి గీత అధ్యక్షతన గురువారం సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉ. 7:30లకు 12వ వార్డులో ప్రారంభమవుతుందని కమిషనర్ శ్రీను తెలిపారు.
KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికే ఆదర్శమని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాములు ఉన్నారు.
KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో పనిచేయుటకు క్యాంపస్ డ్రైవ్ TSKC సహకారంతో నిర్వహించారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌లో విద్యార్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించగా 18 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
SRCL: ఎప్స్టీన్ ఫైల్స్‌లో పేరున్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు డిమాండ్ చేశారు. గురువారం సిరిసిల్ల పట్టణంలోని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రజాప్రతి నిధులదే అన్నారు.
RR: ఫరూఖ్ మండలం చించోడు రైతు వేదికలో రైతులకు నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజల పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు, నిపుణులు రైతులకు నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. నానో ఎరువులను సరైన మోతాదులో పంటలకు పిచికారి చేయడం ద్వారా పంటల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.
MDK: చిట్టీ డబ్బుల విషయంలో మనస్థాపానికి గురై శివంపేట్ మండలం గంగాయిపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరబాద్ మండలం పోతారంలో ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షల చిట్టీ వేయగా, గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన కుటుంబీకులు, గ్రామస్థులు ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని రామాయంపేట మండల తహసీల్దార్ రజనీకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో గ్రామ, మండల స్థాయి సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 12 వరకు కొనసాగే ఈ ప్రత్యేక ప్రణాళికలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.
MBNR: నవాబ్ పేట మండలం లోకిరేవుకు చెందిన సుజాతకు 108 అంబులెన్స్‌లోనే సుఖ ప్రసవమైంది. గురువారం ఉదయం నవాబ్ పేట ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ లక్ష్మణ్, పైలెట్ మహమూద్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేశారు. ఆమె ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.
MNCL: PVYS తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన పాలీసెట్-2026 మోడల్ టెస్ట్ పోస్టర్లను మంచిర్యాల DEO యాదయ్య గురువారం విడుదల చేశారు. పటేల్ విద్యార్థి యువజన సంఘం నిర్వహిస్తున్న ఈ మాదిరి పరీక్షలు పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
BDK: గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మంజుల కోరారు. లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ భూక్యా మంజుల గురువారం తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను, నిల్వ ఉన్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.
WGL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని నర్సంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
KMM: ముదిగొండ మండలంలో గురువారం ఓ గర్భిణీ 108 వాహనంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటగిరి ఇందిరమ్మ కాలనీకి చెందిన లల్లీ (24) అనే గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో వాహనంలోనే ప్రసవించింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
SRD: కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు అన్నారు. గురువారం సంగారెడ్డి పీసీబీ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ శ్రవణ్‌కు వినతి పత్రం అందజేశారు. పరిశ్రమల కాలుష్యం వల్ల పశువులు, చేపలు చనిపోతున్నాయని అన్నారు. మునిపల్లి మండలంలోని రియొమ్ పరిశ్రమలు కాలుష్యం వల్ల బర్లు చనిపోయాయని, మంజీరా నీళ్లు కలుషితం అవుతున్నారు.