• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

UPDATE: గుర్తుతెలియని కళేబరం.. గట్టయ్యగా గుర్తింపు

HNK: ఐనవోలు(M) సింగారం శివారులో ఊరి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి కళేబరం పడి ఉండగా, గ్రామస్తుల సమాచారంతో గ్రామ కార్యదర్శి  అనిల్ కుమార్ పీస్‌లో ఫిర్యాదు చేసారు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహం తిమ్మాపూర్ రామాలయంలోని యాచకుడు గట్టయ్య కళేబరంగా ధృవీకరించారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు.

March 5, 2026 / 04:37 PM IST

‘ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ అవసరం’

ADB: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కృషి, క్రమశిక్షణ, పట్టుదల అవసరమని ఉట్నూర్ ITDA PO యువరాజ్ మర్మాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్‌లో నిర్వహించిన “ఇగ్నిట్ యువర్ డ్రీమ్స్”మోటివేషన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కఠిన శ్రమతో ముందుకు సాగాలని సూచించారు.

March 5, 2026 / 04:37 PM IST

ఒడిలో బిడ్డతో విధులు నిర్వహణ

BDK: పాల్వంచ మండలం బసవతారక కాలనీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భూక్యా వెన్నెల తన విధి పట్ల అంకితభావాన్ని చాటుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారిని ఒడిలో పెట్టుకుని ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు సహనంతో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆమె తల్లితనంతో పాటు విధి నిర్వాహణను నిర్వహిస్తున్నారు.

March 5, 2026 / 04:33 PM IST

‘వేధింపులకు భయపడొద్దు..ఫిర్యాదు చేయండి’

SRCL: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే గురువారం సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తూ విద్యా సంస్థలు, పని ప్రదేశాల్లో ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

March 5, 2026 / 04:31 PM IST

‘వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలి’

SRPT: కోదాడ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి మున్సిపల్ ఛైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ కోరారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో 35 వార్డుల కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

March 5, 2026 / 04:30 PM IST

99 రోజుల ప్రగతి ప్రణాళిక పై దిశా నిర్దేశం

MDK: 99 రోజుల ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులతో ప్రణాళికపై సూచనలు చేశారు. చేగుంట మండలంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాధికారి, నీటి సరఫరా విభాగం, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.

March 5, 2026 / 04:30 PM IST

కాంగ్రెస్ అక్రమ కేసులు బనాయిస్తోంది: మాజీ ఎమ్మెల్యే

MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మనోహర్ రెడ్డి ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జిల్లా జైలులో ఉండగా గురువారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ములాఖాత్‌లో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు పెడుతోందని ఆరోపించారు.

March 5, 2026 / 04:30 PM IST

జోగుళాంబ ఆలయానికి శంకరాచార్య రాక

GDWL: శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శుక్రవారం సాయంత్రం జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్రలో భాగంగా సందర్శించనున్నట్లు ఈవో దీప్తి తెలిపారు. రెండు రోజుల పర్యటనలో బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, అమ్మవారికి శ్రీచక్ర అర్చన నిర్వహించి అనంతరం అనుగ్రహ భాషణం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు.

March 5, 2026 / 04:30 PM IST

మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం

MDK: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఈనెల 6న మెదక్ ఐడీఓసీలో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఇంఛార్జ్ మంత్రి వివేక్, మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.

March 5, 2026 / 04:30 PM IST

విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ మృతి

KMR: రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం ఎప్పటిలాగే స్టేషన్‌లో విధులకు హాజరైన కృష్ణమూర్తికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

March 5, 2026 / 04:30 PM IST

‘బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి’

NRML: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, పీఎఫ్ ఉన్న అర్హత గల బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

March 5, 2026 / 04:26 PM IST

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు: కలెక్టర్

సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పేర్కొన్నారు. గురువారం దుబ్బాక మండలం దుంపలపల్లిలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌లో భాగంగా 12 ఎకరాల్లో సాగును ఆమె ప్రారంభించారు. ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.

March 5, 2026 / 04:23 PM IST

‘మార్చి6 నుంచి 15 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్’

PDPL: ఈనెల 6 నుంచి 15 వరకు గ్రామ, పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ పై డీసీపీ రామ్ రెడ్డి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలన్నారు. రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 5, 2026 / 04:23 PM IST

IOACON 2025 బెస్ట్ పేపర్ అవార్డు

KNR: కరీంనగర్ నగునూరు వైద్యకళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న నూకల శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నిర్వహించిన IOACON- 2025 సదస్సులో కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ యాజమాన్యం, ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు.

March 5, 2026 / 04:21 PM IST

‘మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు’

KMM: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వైరా ఎస్సై పవన్ హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం బ్లూ కోల్ట్ పోలీసులు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న జరిమానాలను వసూలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు.

March 5, 2026 / 04:20 PM IST