MBNR: పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువు పై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.
NLG: నార్కట్‌పల్లి శివారులోని కామినేని ఫ్లైఓవర్ వద్ద సోమవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, TG07T4554, TS07UH4554 నంబర్లు గల లారీల్లో హైదరాబాద్‌కు ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు. లారీలను, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.
జగిత్యాల జిల్లా నెట్‌బాల్ జట్టు ఈనెల 20 నుంచి 23 వరకు మహబూబ్నగర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీఎం కప్ టోర్నమెంట్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుతమైన ఆట తీరుతో జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు. రాష్ట్రస్థాయిలో పాల్గొనడం గొప్ప అనుభవంగా ఉందని క్రీడాకారులు అన్నారు. జిల్లా క్రీడా అభిమానులు, అధికారులు జట్టును అభినందించారు.
BDK: బూర్గంపాడు(మం) సారపాక గాంధీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పదేళ్లుగా అసంపూర్తిగా ఉండగా, దీనిపై ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పందించారు. మిగిలిన పనులకు నిధులు మంజూరు చేసి త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
GDWL: పోలీస్ స్టేషన్‌కు వచ్చేది కేవలం న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చట్టప్రకారం అండగా నిలబడండి అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఆయన నేరుగా 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూవివాదాలు, మోసాల వల్ల ఆవేదనతో వచ్చిన బాధితుల ముందే సంబంధిత అధికారులకు అప్పచెప్పారు.
BHNG: బీజేపీ రాష్ట్ర నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా కేంద్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకోరి అశోక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజకీయ వేధింపులు వెంటనే ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన ముదిగంటి విజయలక్ష్మి అకౌంట్లో, అదే గ్రామానికి చెందిన సీఏ కొత్త లక్ష్మి అక్రమంగా సీఎంఆర్ రిలీఫ్ చెక్కు ద్వారా డబ్బులు వేయించిందని బాధితురాలు ఆరోపించారు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసిన అధికారిపై, నిధుల అక్రమాలకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
PDPL: జిల్లాలో ఈనెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. 22 కేంద్రాలలో 10,367 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు.
RR: వార్డు అభివృద్ధి విషయంలో నిరంతరం ప్రజల వెంట ఉంటానని షాద్‌నగర్ పట్టణ ఆరవ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్ అన్నారు. బాబా నగర్ కాలనీలోని పార్క్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పార్కును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.
NZB: నగరంలోని సీపీ కార్యాలయంలో సోమవారం పోలీస్ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు నమోదయ్యాయి. బాధితుల సమస్యలు విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
MHBD: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని MHBD జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బాసు పట్ల మధు డిమాండ్ చేశారు. MHBD జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో SFI ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో ఇవాళ అశోక్ నగర్ డీఫ్లోరైడ్ ప్రాజెక్టుపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MLA దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని కోరారు.
NGKL: కుమ్మెర ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ స్పందిస్తూ, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
BHPL: జిల్లా BJP కార్యాలయంలో ఇవాళ BJP జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి అధ్యక్షతన ‘పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్–2026’ జిల్లా స్థాయి కార్యశాల జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ధర్మారావు హాజరై మాట్లాడారు. క్రమశిక్షణ సంస్థకు మూలాధారమని, సిద్ధాంత నిబద్ధత, నిస్వార్థ సేవా భావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి బలమన్నారు.
WNP: జిల్లాలో కొనసాగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణ పనులు, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సో మనం వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో తలపెట్టిన నిర్మాణ పనులను మార్చి 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.