NZB: జోగులాంబ గద్వాల జిల్లా నుంచే తాను కొత్త పార్టీ పెడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి ఆధ్వర్యంలో గద్వాలలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో సోమవారం ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏది జరిగిన ఉత్తర తెలంగాణలోని కరీంనగర్లో ప్రారంభం అయ్యేదని కవిత గుర్తు చేశారు.
NZB: బోధన్ మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కమిషనర్ చేసిన కృషిని కలెక్టర్ ప్రశంసించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నఅధికారుల సమన్వయం, క్రమశిక్షణతో కూడిన చర్యలు, ప్రజల సహకారం వల్ల ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.
NLG: తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తన సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల జి.ప.ఉ. పాఠశాలలో టెన్త్ పరీక్ష ఫీజు కట్టలేని 39 మంది విద్యార్థుల ఫీజును ఆయనే స్వయంగా చెల్లించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఎం సుశీల, ఉపాధ్యాయులు చిలక రాజు శ్రీనివాస్, నర్రా సరళ పాల్గొని సంజయ్ దాస్ సేవలను అభినందించారు.
JGL: భీమారం మండలం గోవిందారం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ మహిళా సమైక్య భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. మహిళా సాధికారతకు భవన నిర్మాణాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
SRPT: చివ్వెంల మండలంలోని వల్లబాపురం గ్రామ శివారులో ఇటుకల బట్టిలో పనిచేసే కార్మికుడు పల్లపు రాజు ( 35 ) ఇవాళ ఇటుకల బట్టిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతిని స్వగ్రామం సూర్యాపేట చెందినవాడిగా విశ్వసనీయ సమాచారం. సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.
ASF: కొమురంభీం గొప్ప పోరాటయోధుడని, ఆయన ఆదివాసీల కోసం చేసిన పోరాటం, త్యాగం మరువలేనిదని ప్రముఖ కవి జయరాజ్ అన్నారు. ఈ క్రమంలో ప్రకృతి విజ్ఞాన యాత్రలో భాగంగా సోమవారం జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామాన్ని సందర్శించారు. ఆదివాసీ ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళుర్పించారు.
NGKL: తెలకపల్లి మండలం ఆలేరులో హరితహారం మొక్కలను నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఆనంద్, కార్యదర్శి మహేశ్ సహకారంతో గట్టు బాలిశ్వరయ్య అనే వ్యక్తి మొక్కలను నరికినట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లాలో అంబేద్కర్ కళా భవనం నిర్మించాలని కోరుతూ సోమవారం జిల్లా ప్రజావాణిలో సామాజిక వేత గంధం నాగరాజు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దళితులకు అంబేద్కర్ పేరు మీద భవనం చేపట్టి దళితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మారమ్మ కుంట దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో నిర్మించాలని కోరారు.
KNR: శంకరపట్నం మండలం తాడికల్ రైతు వేదికలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్, మెట్పల్లి, కేశవపట్నం, వంకాయగూడెం, తాడికల్, ఇప్పలపల్లి, అంబాలాపూర్, కరీంపేట, చింతగుట్ట, ఏరడపల్లి గ్రామాల నూతన వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం 2018 పై శిక్షణ ప్రారంభమైంది. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన ఈనెల 27 వరకు కొనసాగనుంది. పంచాయతీ కార్యదర్శులు, 9 గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.
KMM: మున్సిపల్ ఛైర్మన్ పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా మండలంలోని పడమటిలో కారంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఛైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. పశు వైద్యులు మూగజీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.
VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా అధికారులు ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపి న్యాయం చేయాలన్నారు.
MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ ఎంజాల స్వామి శంకుస్థాపన పూజ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మహిళా సంఘ భవనానికి రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఏఈ మధుసూదన్‌లతో కలిసి భూమిపూజ నిర్వహించారు. వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
SRCL: ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
VKB: కుల్కచర్ల ఉపాధ్యాయులు కాంప్లెక్స్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ఇంఛార్జ్ MEO రామ్ చందర్ అన్నారు. మండలంలోని ముజాహిద్పూర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశాలను నిర్వహించారు. విద్యార్థులకు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన చేయాలన్నారు. FLSను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు.
KMR: కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి సోమవారం పదవీ బాధ్యత స్వీకరించారు. ఈ తరుణంలో కామారెడ్డి ఇంఛార్జ్ మంత్రి సీతక్క ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. “రావాల్సింది ఉండే కానీ రాలేకపోయాను. మంత్రితో మీటింగ్ ఉండడం వలన రాలేకపోయాను” అని ఫోన్‌లో తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఛైర్ పర్సన్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.