• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మేడ్చల్ చెక్‌పోస్ట్ యూ-టర్న్ వద్ద వాహనం బ్రేక్ డౌన్

MDCL: మేడ్చల్ చెక్‌పోస్ట్ సమీపంలోని యూ-టర్న్ వద్ద వాహనం బ్రేక్ డౌన్ అవ్వడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. చెక్‌పోస్ట్ వైపు వచ్చే వాహనదారులు వేగం తగ్గించి, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

February 26, 2026 / 02:42 PM IST

కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

SDPT: అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 26, 2026 / 02:42 PM IST

కలెక్టర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే కడియం

JN: బదిలీపై జోగులాంబ గద్వాల్ జిల్లాకి వెళ్తున్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం సన్మానించారు. జిల్లా పేరును జాతీయ స్థాయికి కలెక్టర్ తీసుకెళ్లారు అని కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ సాధించారు అని, విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారని, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందించారన్నారు.

February 26, 2026 / 02:41 PM IST

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేసిన కార్పొరేటర్

HYD: రహమత్ నగర్ డివిజన్‌లో అభివృద్ధికి నిధులు కేటాయించాలని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. డివిజన్‌లో సీసీ రోడ్ల పనులు, రహమత్ నగర్ జంక్షన్ విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన ఎమ్మెల్యేకు వినతి పత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన వారు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

February 26, 2026 / 02:38 PM IST

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

JGL: రాయికల్ మండలంలోని రామాజీ పేట్ గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆయన సుమారు 650 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. అధికారులతో కలిసి నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 02:34 PM IST

చంద్రుగొండ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పర్యటించారు. ముందుగా గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గ్రామ సర్పంచ్ భూక్యా సరితా సుధాకర్ ఉప సర్పంచ్ కుక్కల ముత్యాలరావు గ్రామ శాఖ అధ్యక్షులు బోగిన బోయిన కోటేశ్వరరావు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వివో భవనాన్ని శంకుస్థాపన చేశారు.

February 26, 2026 / 02:33 PM IST

37 మందికి మోతిబిందు గుర్తింపు

KMR: బీర్కూరు మండలంలోని బరంగు ఏడిగి గ్రామంలో గురువారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మొత్తం 142 మందికి పరీక్షలు చేయగా, 37 మందికి మోతిబిందు సమస్య ఉన్నట్లు వైద్య సహాయకులు అజయ్, రాకేశ్ తెలిపారు. వీరికి బోధన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్, సర్పంచ్ అనిల్, హనుమంతరావు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:33 PM IST

జాతీయ స్థాయిలో చిన్నచింతకుంట విద్యార్థి సత్తా..!

MDK: నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన బ్యాగరి రాకేశ్ జాతీయ స్థాయి కెమిస్ట్రీ పోటీ పరీక్షలో 98వ ర్యాంక్ సాధించి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్యాట సరిత ఆయనను సన్మానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.

February 26, 2026 / 02:33 PM IST

ఉపాధి హామీ పనులు పరిశీలన

SDPT: అక్కన్నపేట మండలం మల్చేరుతండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ గుగులోతు మహేందర్ నాయక్, వార్డు సభ్యులు రజిత సంపత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనులు నాణ్యతగా కూలీల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కొనసాగించాలని తెలిపారు.

February 26, 2026 / 02:31 PM IST

‘పేదలను తక్షణమే న్యాయం చేయాలి’

KMM: ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కోరారు. అర్హులైన పేదలను గుర్తించి వారికి తక్షణమే న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. భూదాన్ భూములను కేవలం ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని వారు డిమాండ్ చేశారు.

February 26, 2026 / 02:29 PM IST

ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

JGL: జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత శిక్షణకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదలైనట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. అభ్యర్థులు https://tsstudycircle.co.in వెబ్ సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మార్చి1న ఉదయం 10-1 గంటల వరకు రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్ టికెట్, ఆధార్ కార్డు ఉంటేనే పరీక్షకు అనుమతిస్తామన్నారు.

February 26, 2026 / 02:29 PM IST

సమిష్టి నిర్ణయాలతోనే ముందుకు వెళ్లాలి: జూపల్లి

ADB: కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ పట్టణానికి వచ్చిన ఆయనకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సాగర స్వాగతం పలికారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

February 26, 2026 / 02:29 PM IST

కర్రనే కరెంట్ స్తంభం

SDPT: అక్కన్నపేట మండలంలోని అంతక్కపేట నుంచి చిన్నగుడిపాడు వెళ్లే రహదారిపై విద్యుత్ తీగలు యమపాశాలుగా మారాయి. చేతికందే ఎత్తులో తీగలు వేలాడుతుండటంతో స్థానికులు కర్రను స్తంభంగా ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఆపుతున్నారు. పగలు, రాత్రి రైతులు, ప్రయాణికులు తిరిగే ఈ దారిలో గాలివానకు కర్ర కూలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

February 26, 2026 / 02:27 PM IST

‘ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి’

NLG: దేవరకొండలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డీఎన్టీ హాస్టల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘ప్లాస్టిక్ వస్తువుల వినియోగం దాని పర్యవసానాలు’ అనే అంశంపై గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

February 26, 2026 / 02:24 PM IST

పోచమ్మ బోనాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JGL: రూరల్ మండలం రఘురాములకోట గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 02:22 PM IST