KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల రికార్డుల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఉప్పల వెంకటరమణ ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల పేర్లు భూభారతి పోర్టల్ నుంచి మాయమై ప్రైవేట్ వ్యక్తుల పేర్లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమాలకు పాల్పడిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలనిభూములపై పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో అడిషనల్ కలెక్టర్ నరసింగరావు, RDO శ్రీనివాసరావుతో కలిసి ప్రజలనుంచి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ నమోదు చేసి వారంలోగా పరిష్కరించాలన్నారు.
SRPT: తప్పుడు అర్హత పత్రాలతో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ కిరణ్ కుమార్‌కు చెందిన యాపిల్ డయాగ్నోస్టిక్స్ అండ్ స్కాన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. కలెక్టర్ తేజస్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. వైద్యుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఇవాళ వైద్యారోగ్యశాఖ అధికారి వేంకట రమణ తెలిపారు.
NZB: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వరాలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 7 గంటల లోపు పూజాధి కార్యక్రమాలు ముగించి ద్వార బంధనం చేయనున్నట్లు అర్చకుడు గణేశ్ శర్మ తెలిపారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. గ్రహణ కాలంలో భక్తుల ఆర్జిత సేవలు రద్దు చేయడం జరిగిందన్నారు.
MHBD: హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పిలుపునిచ్చారు. సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై వాహనదారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
MBNR: హైదరాబాద్ ఇందిరా ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగుల బకాయిల కోసం తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మద్దతు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించిందన్నారు.
NGKL: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సినీ హీరో విజయ్ దేవరకొండ రిసెప్షన్‌లో పాల్గొన్నారు. బల్మూర్ మండలంలోని తుమ్మన్ పేట గ్రామంలో విజయ్ దేవరకొండ రష్మికల రిసెప్షన్‌తో పాటు వివిధ కార్యక్రమాలు సోమవారం ఎంతో వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే కసిరెడ్డితో పాటు నగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, తదితరులు పాల్గొని విజయ్ దేవరకొండ దంపతులను ఆశీర్వదించారు.
KNR: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి కలెక్టర్ చిత్రా మిశ్రా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పలువురు అధికారులు ఉన్నారు.
MNCL: కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో సోమవారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. తనిఖీల్లో నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత గుడుంబాను తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
ADB: కంది పంటతోపాటు కోతకు వచ్చిన శనగ పంటను మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేయాలని జైనథ్ మండల రైతులు కోరారు. సోమవారం MLA పాయల్ శంకర్‌ను కలిసి యాసంగి పంటలను కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డులో జొన్న, మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.
BDK: ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుని దేవాలయంలో సోమవారం కళ్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేణుగోపాల స్వామి వారి కళ్యాణం ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారిని అభినందించారు.
JGL: రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో సోమవారం శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ద్వి దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. రాయికల్, బోర్నపల్లి, వస్తాపూర్, ఒడ్డె లింగాపూర్ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మి రామానంద్ అన్నారు. నర్సంపేట 9,12వ వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ గంధం నరేందర్ గుప్తా, తదితరులు ఉన్నారు.
SRD: విద్యార్థులు చదువుతూపాటు క్రీడల్లో నైపుణ్యం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సి.యం. కప్ పోటీలలో జిల్లా స్థాయిలో విజయం సాధించి, రాష్ట్ర స్థాయిలో మొదటి, రెండవ, మూడవ స్థానంలో సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ సోమవారం అభినందించారు. ఆరోగ్యానికి ఆటలు ఎంతగానో అవసరమని సూచించారు.
NLG: బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను నల్గొండ పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి అనంతరం బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా బూర నర్సయ్య మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్రజాసేవలో ఎప్పుడు ఉంటూ సేవ చేస్తానని అన్నారు.