MNCL: ఇన్స్పైర్ మానక్ అవార్డుకు TGSWRJC మంచిర్యాల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి ముప్పిడి రామ్ చరణ్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గురువారం తెలిపారు. తన వినూత్న ఆలోచనతో ఈ ప్రతిష్టాత్మక పథకానికి ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ లేదా మోడల్ రూపొందించేందుకు రూ.10,000 మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.
GDWL: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. టూరిజం పాలసీలో 27 స్పెషల్ టూరిజం ప్రాంతాలను ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తించిందన్నారు. అందులో గద్వాల జిల్లా ఉందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఐ డెక్ ఆర్కిటెక్చర్ ప్రతిపాదనలపై గురువారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మహబూబాబాద్ పట్టణంలో ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో కలిసి గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిశారు. రైతుల ఆదాయాన్ని రక్షించడానికి మక్కలను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నల్లు సుధాకర్ రెడ్డి, పోలేపాక వెంకన్న, నాగరాజులు కలెక్టర్‌కు మొక్క అందజేసి అభినందనలు తెలిపారు.
గద్వాల జిల్లాలో పేదరికం, నిరక్షరాస్యత కోరల్లో చిక్కుకున్న చాలా కుటుంబాలు ఉన్నాయని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ కలెక్టర్‌కు గురువారం విన్నవించారు. జిల్లాకు నూతనంగా బదిలీలు వచ్చిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా ను ఆయన కలిశారు. ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. సామాన్యుడికి విద్య, వైద్యం, వ్యవసాయ ఫలాలు అందేలా కృషి చేయాలన్నారు.
NRPT: ధన్వాడ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు సహకరించాలని, సర్పంచులు కీలక పాత్ర పోషించాలని సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. గురువారం ధన్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
KMR: జిల్లా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ షెట్కార్, వైస్ ఛైర్మన్ భాగ్యలక్ష్మిలను గురువారం టీఎన్జీవో యూనియన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ ప్రాజెక్టు సెక్రటరీ విజయలక్ష్మి, తదితరులు పాలుగోన్నారు.
KMM: సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మాజీ సీఎం సర్దార్ జలగం వెంగళరావు పేరు పెట్టారు. వెంగళరావు పేరు పెట్టేందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్‌లకు మున్సిపాలిటీ ప్రజలు, నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 1973 నుంచి 1978 వరకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా పని చేశారు.
SRPT: కోదాడ పెన్షనర్ల సంఘ భవనంలో ఈనెల 7న శనివారం నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. గురువారం కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సంఘ సభ్యులతో కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
NLG: హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖాయమని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
MDK: తూప్రాన్ పట్టణం మూడో వార్డులో సీసీ రోడ్డు తొలగింపు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. మూడో వార్డులో అనుమతి లేకుండా బాలు సీసీ రోడ్డును తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రోడ్డును తొలగించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించినట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు.
NZB: నవీపేట్ మండలం కమలాపూర్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు.
MBNR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కౌకుంట్ల మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లిం సోదరులకు గురువారం సాయంత్రం తెలంగాణ బ్యాంకు ఉద్యోగి శ్రీనివాసులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నీ మతాల ప్రజలు ఐక్యతతో పండుగలు జరుపుకోవాలని శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు బ్యాంక్ శ్రీనుకు శాలువాతో ఘనంగా సన్మానించారు.
KNR: విద్యుత్ మెటీరియల్ త్వరగా విడుదల చేయడానికి, మెటీరియల్‌ను త్వరగా డ్రా చేసుకోవడానికి ఈ స్టోర్ల ద్వారా ఆన్లైన్ సౌకర్యం అందిస్తున్నామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాట్సాప్ చాట్ ప్రవేశ పెట్టడం జరిగిందని, దీని ద్వారా సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు 7901628348 ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
WGL: వృద్ధులకు వికలాంగులకు నూతన పెన్షన్ మంజూరు చేయాలని ఇవాళ MCPIU పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి జన్ను రమేష్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల కాలం నుంచి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ రాలేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కోరారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో గురువారం నిర్వహించిన ఇఫ్తార్ వేడుకలలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లా ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కాంక్షించారు. కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్, మైనార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.