• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పైపు లీకేజీ.. తాగునీటి వృథా

NRPT: మక్తల్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో జూనియర్ కాలేజ్ వెనుక భాగంలో ఉన్న ఎల్బి కాలనీ మధ్యలోని మెయిన్ రహదారి పక్కన మంచినీటి పైప్ లైన్ పగిలి నీరు వృథాగా పోతున్నది. ఈ సమస్య తరచుగా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వార్డులో మంచినీటి పైపులైన్ సమస్యలు పదేపదే వస్తుండటం వల్ల సమయానికి తాగునీటికి ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు.

March 9, 2026 / 10:26 AM IST

కీలక నిర్ణయం తీసుకున్న ఓపెన్ యూనివర్సిటీ

HYDలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 18 యూనివర్సిటీలను అనుసంధానం చేస్తూ ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (IDEA) పేరుతో నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వేదిక ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు విద్య, పరిశోధన అవకాశాలతో పాటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై సమాచారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

March 9, 2026 / 10:25 AM IST

‘ఈ-వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూడాలి’

JN: ఈ- వేస్ట్ వల్ల పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జనగామ మండలంలోని శామీర్‌పేట్ గ్రామ పరిధిలో గల DRC కేంద్రాన్ని సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని ఆయన తెలిపారు. 

March 9, 2026 / 10:23 AM IST

పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు: తాండూరు కమిషనర్

VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలో దీర్ఘకాలంగా ఇంటి పన్ను చెల్లించని బకాయిదారులకు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్వయంగా ఇంటింటికి వెళ్లి రెడ్ నోటీసులు అందజేశారు. మొండి బకాయిలు ఉన్న యజమానులు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో మున్సిపల్ చట్టం- 2019 ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 10:20 AM IST

నగరంలో RTC బస్సులకు GPS ట్రాకింగ్

HYD: నగర ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సుల GPS ట్రాకింగ్ వ్యవస్థను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న బస్సులకు అదనంగా మరిన్ని బస్సుల్లో GPS పరికరాలను ఏర్పాటు చేశారు. దీంతో బస్సుల రాకపోకలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం సులభంగా మారుతుందన్నారు.

March 9, 2026 / 10:20 AM IST

‘రైతులకు 450 యూరియా బస్తాలు సిద్ధం’

WNP: వనపర్తి మండలం రాజనగరం PACSలో రైతులకు పంపిణీ చేసేందుకు 450 యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నట్లు PACS కార్యదర్శి మహేందర్, సింగల్ విండో డైరెక్టర్ సంజీవ్ సాగర్ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని.. అవసరం ఉన్న రైతులు యూరియా బుక్ చేసుకోవాలని కోరారు. యూరియా తీసుకొనేప్పుడు రైతు ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్సులు ఇవ్వాలన్నారు.

March 9, 2026 / 10:20 AM IST

మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో వేసవికాలం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ తెలిపారు. స్థానిక 9వ వార్డులో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

March 9, 2026 / 10:17 AM IST

గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!

BDK: గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఇకపై ఒక సిలిండర్ డెలివరీ అయ్యాక రెండో దాని కోసం 21 రోజులు వేచి చూడాలి. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల మార్చి 7 నుంచి సిలిండర్ ధర రూ.60 పెరిగింది. మరోవైపు బుకింగ్ చేసిన తర్వాత 24 గంటల లోపు వినియోగదారులకు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు జిల్లాల ఏజెన్సీలకు సూచించాయి.

March 9, 2026 / 10:15 AM IST

‘రూ. 1 కోటి నిధులతో మందమర్రి ట్యాంక్ బండ్ అభివృద్ధి’

MNCL: పట్టణాలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు సోమవారం అన్నారు. మంత్రి వివేక్ సహకారంతో రూ. 1 కోటి నిధులతో మందమర్రిలోని ట్యాంక్ బండ్ అభివృద్ధిలోకి తీసుకురానున్నట్లు హామీ ఇచ్చారన్నారు. పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుందన్నారు.

March 9, 2026 / 10:14 AM IST

చెట్లపై పడిన విద్యుత్ వైర్లు.. పట్టించుకోని అధికారులు

KMR: జుక్కల్ మండల కేంద్రంలో ఈదురు గాలులకు చెట్లపై విద్యుత్ వైర్లు తెగి పడుతున్నాయి. అటుగా వెళ్లే వారు ఈ వైర్లను గమనించకపోతే ప్రాణహాని తప్పదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ వైర్లపై అవగాహన లేని చిన్నారులకు సైతం ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఈ విషయంపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 9, 2026 / 10:13 AM IST

‘మండల అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తుల ఆహ్వానం’

ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణం, రెబ్బెన, ఆసిఫాబాద్ రూరల్ మండలాల అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి గల నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సంప్రదించాలని డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. వాంకిడి, తిర్యాని మండలాల కార్యకర్తల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించామన్నారు. అర్హులైన నాయకులు నిర్ణీత సమయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు.

March 9, 2026 / 10:12 AM IST

రాష్ట్ర స్థాయి కరాటే క్యాంప్‌లో జిల్లా విద్యార్థులు

JGL: హైదరాబాద్‌లోని అవే మరియా స్కూల్, రామంతపూర్‌లో Japan Karate Association India Telangana ఆధ్వర్యంలో సీనియర్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ముంబైకు చెందిన చంద్రశేఖర్ శెట్టి విద్యార్థులకు ఉన్నత స్థాయి కరాటే శిక్షణ ఇచ్చారు. జగిత్యాల జిల్లా నుంచి 8 మంది శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ వివరించారు.

March 9, 2026 / 10:12 AM IST

హాలియాలో పేకాట స్థావరంపై దాడి

NLG: హాలియాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. హాలియాలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53,600 నగదు, ఏడు మొబైల్ పోన్లు, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

March 9, 2026 / 10:10 AM IST

ఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలు

ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

March 9, 2026 / 10:08 AM IST

అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మంత్రి సమీక్ష

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు.

March 9, 2026 / 10:08 AM IST