SRCL: తంగళ్ళ పల్లి మండలం నేరెళ్ల బాధితుల వద్దకు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమారిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నేరెళ్లలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిన కూడా నేరెళ్ల బాధితులకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
KNR: గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత పాల్గొన్నారు.
JGL: కోరుట్ల మండలం వేంపేట గ్రామానికి చెందిన ఇప్ప జలంధర్ కుమార్తె సుప్రియ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీవోగా రెండు ఉద్యోగాలు సాధించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేంద్ర రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. సుప్రియ గ్రామ యువతకు ఆదర్శం, యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
MHBD: కేంద్ర ప్రభుత్వం మహిళా కార్మికులపై అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న మహబూబాబాద్‌లో నిర్వహించే శ్రామిక మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణవేణి కోరారు. బుధవారం సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. మహిళా కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
NRML: బీడీ కార్మికులకు పెరిగిన కరువు భత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజన్న డిమాండ్ చేశారు. బుధవారం సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. కరువుభత్యం రూ.5.50 పెరగడంతో ప్రతి 1000 బీడీలకు రూ.268.31 చెల్లించాలన్నారు.
KMM: చింతకాని మండలం రేపల్లెవాడ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం డ్రైన్లలో పేరుకుపోయిన పూడిక (సిల్ట్) తొలగింపు కార్యక్రమాన్ని సర్పంచ్ మడిపల్లి అంబిక ప్రారంభించారు. వర్షాకాలం దృష్ట్యా నీరు నిల్వ ఉండకుండా, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. గ్రామస్తులందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
NGKL: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రవల్లి తండాల గ్రామస్థులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు బుధవారానికి 93వ రోజుకు చేరుకున్నాయి. తమ గ్రామాలు రిజర్వాయర్ ముంపునకు గురికావద్దని కోరుతూ.. ఇరు గ్రామాల ప్రజలు పట్టువదలని పోరాటం చేస్తున్నారు.
JN: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామ పరిధిలోని శ్రీ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పైకి వెళ్ళే రోడ్డు నిర్మాణం కోసం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి శంకుస్థాపన చేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వచ్చి దాన్ని పూర్తి చేస్తాం అని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదన్నరు.
BHPL: తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ రాహుల్ శర్మ ఆవిష్కరించారు. 2026-27 విద్యా సంవత్సరానికి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు అర్హులైన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడాశాఖ అధికారి రఘు ఆధ్వర్యంలో ఈ ఎంపికల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
NLG: గట్టుప్పల్ మండల కేంద్రంగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఇడం కైలాసం ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక సబ్ సెంటర్‌ను పరిశీలించిన ఆయన ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్పిటల్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు.
BHNG: భువనగిరి మండలం తుక్కాపురం గ్రామపంచాయతీకి చేనిగాచర్ల గ్రామానికి చెందిన బింగి నరేష్ యాదవ్ స్వంత డబ్బులతో వాళ్ళ అమ్మ నాన్న కీ.శే. బింగి శాంతమ్మ,పెంటయ్య జ్ఞాపకర్థంగా రూ.60 వేలు పెట్టి మైక్ సెట్‌ను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ పాండు నరేష్‌ను సన్మానించారు.
GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సంధ్యా కిరణ్మయి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను సరిగా తనిఖీ చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గర్భిణీకి సురక్షితమైన సాధారణ ప్రసవాలు జరగాలని అధికారులు జాగ్రత్తగా చూడాలని ఆమె సిబ్బందికి ఆదేశించారు.
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ పెద్దపల్లి మండలం రాఘవపూర్‌లో నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నచిన్న పెండింగ్ పనులు పూర్తిచేసి మార్చి 31 నాటికి భవనాన్ని ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MNCL: అడవులు, వన్యప్రాణులతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని తాళ్లపేట FRO సుష్మారావు అన్నారు. బర్ద్ వాచ్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం మండలంలోని గోండుగూడా గేటు ద్వారా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని, వాటిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు.
MNCL:హోలీ పండుగ పురస్కరించుకొని కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద ప్రాణహిత నదిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. నది లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని, ఎవరూ స్నానాలకు రావద్దని సూచించారు. CI కృష్ణ ఆదేశాల మేరకు సర్పంచ్ రవళి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్లను నది వద్ద కాపలా ఉంచారు. ప్రజలు సహకరించాలని కోరారు.