• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రాహుల్ గాంధీకి కేసీఆర్ మద్దతు, కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా?

రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో లేదా ఎన్నిల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే అవకాశాలు ఉన్నాయా? మొదట జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాకుంటే హంగ్ ఏర్పాటయ్యే పక్షంలో హస్తం-కారు దోస్తీ తప్పదా? జాతీయ రాజకీయాల్లోను ఎన్డీయే వ్యతిరేక కూటమి యూపీఏకు వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు నేపథ్యంలో కేసీఆర్ కూడా అదే మార్గంలో నడవక తప్పదా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప...

January 3, 2023 / 02:44 PM IST

పుష్కర కాలంలో 4 పార్టీలు మారాడు, కేసీఆర్ లెక్కలేమిటో?

కాపు సామాజిక వర్గానికి చెందిన నేత తోట చంద్రశేఖర సోమవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పలు పార్టీలు మారిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌‍లో ప్రభావం చూపే అవకాశం తక్కువేనని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో నిలకడగా ఉండగలుగుతారా? కాపు సామాజిక వర్గంలో ఎంత పట్టు ఉంది? అధికారిగా తప్ప, రాజకీయాల...

January 2, 2023 / 09:17 PM IST

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం… కొడాలి నాని రియాక్షన్ ఇదే..!

ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలో చేరే నేతలు కూడా పెరుగుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా… ఈ పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుంది అనే విషయంపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.  ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టడంలో గానీ, రాష్ట్రానికి నష్టం కలిగించడంలో గానీ కేసీఆర్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు నమ్ముత...

January 2, 2023 / 07:21 PM IST

ఏపీలోని 175 సీట్లలో పోటీ, పోలవరంను కేసీఆర్ పూర్తి చేస్తారు

తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లుగానే, ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్ గౌడ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ తదితరులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆం...

January 2, 2023 / 07:14 PM IST

బీఆర్ఎస్ ఏపీలో అధికారంలోకి వస్తే… రావెల కిశోర్ బాబు షాకింగ్ కామెంట్స్..!

బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను  తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు. నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర...

January 2, 2023 / 07:06 PM IST

దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి, అసంతృప్తి చల్లారినట్లేనా?

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ దూకుడు కనిపిస్తోంది. నిన్నటి వరకు నిర్లిప్తంగా, సీనియర్లు-జూనియర్లు అంటూ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు కనిపించిన హస్తం పార్టీ సోమవారం జోరుమీద కనిపించింది. సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టేందుకు రావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ...

January 2, 2023 / 06:57 PM IST

కేసీఆర్ పవన్‌కు గండి కొడతారా?

కేసీఆర్ ఏపీలో పవన్ కళ్యాణ్‌కు గండి కొడతారా? ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన భారత రాష్ట్ర సమితి(BRS) జాతీయ పార్టీగా మారడంతో ఇతర రాష్ట్రాలలో పార్టీ పటిష్టత, కార్యకలాపాలు, పోటీ తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తొలుత సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అడుగులు వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పార్టీ అనుబంధ వ...

January 2, 2023 / 05:33 PM IST

నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారు… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!

తన ఫోన్ ని ప్రభుత్వాలు హ్యాక్ చేస్తున్నాయని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలంటూ ఆపిల్ సంస్థ తనకు హెచ్చరించిందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఐ ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ యాపిల్ సంస్థ తనకు పంపిన హెచ్చరికను ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ...

January 2, 2023 / 05:02 PM IST

రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్….!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచుల నిధుల స‌మ‌స్య‌ల‌పై రాజీవ్ గాంధీ పంచాయ‌తీ రాజ్ సంఘ‌ట‌న్ ఆధ్వ‌ర్యంలో ఈరోజు హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నాచౌక్ లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీనికోసం పోలీసుల అనుమ‌తులు కోర‌గా, నిరాక‌రించారు. పోలీసులు అనుమ‌తులు నిరాక‌రించిన‌ప్ప‌టికీ, స‌మ‌స్య‌ల‌పై ధ‌ర్న...

January 2, 2023 / 02:30 PM IST

సర్పంచుల డబ్బులను డ్రా చేసుకున్నారు… హరీష్ రావుపై ఈటల కామెంట్స్..!

తెలంగాణ మంత్రి హరీష్ రావుపై  బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శల వర్షం కురిపించారు.  కేంద్రం ఇచ్చిన నిధులను వృథా చేశారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులను సర్పంచులకు తెలియకుండా డ్రా చేశారని ఈటెల రాజేందర్ విమర్శించారు. 12 వేల గ్రామాల్లో నిధులు లేక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే అవి పట్టించుకోకుండా ఇతర పార్టీల మీద విమర్శ చేస్తున్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వమని మీ మామను  కన్విన...

December 30, 2022 / 06:54 PM IST

న్యూ ఇయర్ స్పెషల్.. మెట్రో స్పెషల్ ఆఫర్, ట్రాఫిక్ ఆంక్షలు..!

న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు&#...

December 30, 2022 / 06:48 PM IST

మందుబాబులకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్..!

కొత్త సంవత్సరం అనగానే మందుబాబులు రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే… రోజూ మద్యం సేవించే వారు మాత్రమే కాదు…. మందు అలవాటు ఉన్నవారందరూ.. దాదాపు ఒక్క పెగ్ అయినా వేయాలనే అనుకుంటారు. అలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం… ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నార్మల్ గా  అయితే… నగరంలో 10 లేదంటే… 11 గంటలకు అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. కానీ… డిసెంబర్ 31 రోజు మాత్రం.....

December 29, 2022 / 11:14 PM IST

దాసోజుకు పదవి దక్కేనా? ఎన్నికల ముందు కేసీఆర్‌కు ఇదో పెద్ద చిక్కే!

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పద...

December 29, 2022 / 04:17 PM IST

కిషన్ రెడ్డిపై తలసాని సీరియస్…!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు.  కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని...

December 28, 2022 / 07:09 PM IST

రేవంత్ రెడ్డి సొంత ఛానల్, ఎందుకంటే?

రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...

December 28, 2022 / 06:46 PM IST