BDK: ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో ప్రజా ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పేదలందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితోపాటు స్థానిక నూతన పాలకవర్గం పాల్గొన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో శుక్రవారం పలువురు లబ్దిదారుల ఇళ్లకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని. ముందుకురాని లబ్దిదారుల కోసం ప్రైవేట్ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
SRCL: వేములవాడ రూరల్ మండలం హనుమక్కపల్లిలో చిరుతపులి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
JN: పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ తెలిపారు.
SRD: రామచంద్రాపురంలో సంత్ గురు రావిదాస్ బోధనలు సమాజంలో సమానత్వం, ప్రేమ పెంపొందించాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారతి నగర్ బొంబాయి కాలనీలో గురు రవిదాస్ 649వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోచి కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
KMR: రాజంపేట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
MBNR: జడ్చర్ల మండలం కుర్వగడ్డ పల్లి గ్రామంలోని శ్రీ పరుశవేధిశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మిడ్జిల్కి చెందిన శ్రీ మాత ఇద్దమ్మ దేవి భజన మండలి రెండో బహుమతి సాధించింది. నిర్వాహకులు విజేతలకు రూ.80,106తో పాటు మెమొంటో అందజేసి అభినందించారు. భక్తుల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
RR: నందిగామ గ్రామపంచాయతీలో కాలనీలు ప్రగతి కాంతులతో విరజిమ్ముతున్నాయి. సర్పంచ్ కొమ్ము కృష్ణ ఆదేశాల మేరకు ఏడవ వార్డు సభ్యులు సురేష్ ఆధ్వర్యంలో కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో వార్డులో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు.
VKB: తాండూరు పట్టణ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్‌తో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణాలు పూర్తయి చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరలో లబ్ధిదారకు అందజేయున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులను త్వరలో ఎంపిక చేయనున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.
KMM: ప్రయత్నమే విజయానికి మార్గమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సీఎం కప్ – 2025-2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియం ఆవరణలో నిర్వహించారు. ఈ రాష్ట్రస్థాయి అర్చేరీ క్రీడ పోటీలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.
NGKL: చారకొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ లో ముంపునకు గురి అవ్వద్దని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 81 రోజులకు చేరుకున్నాయి. అలాగే R&R ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులు మా భూములు మాకు కావాలని, మా ఇండ్లు ముంపునకు గురి కాకుండా కాపాడాలని కోరారు.
HYD: అమీర్పేట్లో నీలగిరి భవన్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. మైత్రివనం జంక్షన్ నుంచి సత్యం థియేటర్ రోడ్డుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపుకి వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.