నందమూరి తారకరత్నను కుప్పం పీఈస్ హాస్పిటల్ నుండి వైద్యులు బెంగుళూరుకు తరలించారు. రెండు ప్రత్యేక అంబులెన్స్ లో తారకరత్నను నారాయణ హృదయాలయ హాస్పిటల్ సిబ్బంది తరలించింది. అత్యధునిక పరికరాలుతో కూడిన అంబులెన్స్ లో తరలించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థకు గురై, సొమ్మసిల్లి పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అతనిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మెరుగైన చికిత్స క...
ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40,889 జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం నోటిఫికేషన్ లో ఏపీకి సంబంధించి 2,480 పోస్టులు, తెలంగాణ నుంచి 1266 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష సబ్జెక్టులతో పదో తరగతిపాసైన వారు ఈ పోస్టుకు అర్హులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ...
బైక్ పై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు నమోదు చేయించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందీ ఘటన. కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్‌లో ద్విచక్ర పై వస్తుండడాన్ని గమనించిన స్థానిక ఎస్సై రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి ముర...
దేశ భవిష్యత్తు కోసమే బీఅర్ఎస్ తో ముందుకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డ్రాగన్ దేశం చైనా కంటే మన సంపద ఎక్కువ అని, కానీ అమెరికా, చైనా దేశాలు ఇప్పుడు అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాం అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశంలో తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పూర్తి స్థాయిలో సాగునీరు అందడం లేదన్...
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో పదవి లభించింది. ఆ పదవితో దేశంలోనే అరుదైన గౌరవం పొందారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియామకమయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ ప్రకటించారు. ఏడాది పాటు కవిత ఆ పదవిలో ఉండనున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో చేసిన సేవలు ఇకపై దేశవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి ...
తెలంగాణలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఆత్మహత్యలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ జయరామ్ పంఘి శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగా...
తండ్రి లేడు.. తల్లి కూలీ పనులు చేస్తూ కష్టపడి చదివిస్తోంది. బుద్ధిగా చదువుకుంటున్న అమ్మాయిని తోటి విద్యార్థులు కన్నేశారు. ఆమెను ఆట పట్టించడం మొదలుపెట్టారు. ఆమెకు ప్రలోభాలు చూపించి లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాళ్లు మొక్కుతా వదిలేయండి అని బతిమిలాడినా వినలేదు. అడవికి తీసుకెళ్లి ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు అత్యాచారం చేశారు. పాశవికంగా ప్రవర్తించడ...
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి ప్రారంభమైంది. బొంరాస్‌పేటలో గల ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పాదయాత్రను ప్రారంభించారు. మదనపల్లి నుంచి దుద్యాలకు సాగుతుండగా రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ కూలీలను పలకరించారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.పెట్టుబడి ఖర్చులు, మార్కెట్‌లో పంట...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్‌లో దూకుడు పెంచారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తిస్థాయిలో పావులు కదుపుతున్నారు రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొండగల్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకు...
మూడో భార్య రమ్య నుంచి తనకు ప్రాణ హానీ ఉందని సినీ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు. గత ఏడాది ఏప్రిల్...
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ పనుల్లో బిజీగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో మైత్రి ఉండనే ఉంది. ఒడిశాపై కేసీఆర్ దృష్టిసారించారు. ఇటీవల మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, తన కుమారుడు శిశిర్ గమాంత్‌తో కలిసి కేసీఆర్‌ను కలిశారు. ఈ రోజు వారిద్దరూ బీఆర్ఎస్ పార్టీలో చేరతారని తెలిసింది. వ...
పెన్షనర్లకు ఈపీఎఫ్‌వో షాక్ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వారిపై ఇక బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసిన వారిపై ఈ ప్రభావం ఉంటుంది. అధిక వేతనం ఉండి రిటైరయ్యే వారికి పెన్షన్ ఎక్కువే ఉంటుంది. ఆ అధిక పింఛనును ఈపీఎఫ్‌వో రద్దుచేసింది. అందుకు గల కారణాలను వెల్లడించింది. పింఛను పథకం సవరణకు ముందు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇవ్వని వారికి ప్రస్తుతం ఇస్తోన్న అధిక పెన్షన్ ఇవ్వరు. 20...
టమాటా ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి సెంచరీకి చేరే కిలో టమోటా రేటు..ఇప్పుడు ఒక్కసారిగా ఢమాల్ మంది. ఎప్పుడు ఏ ధర ఉంటుందో అర్థంకాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. టమాటా ధరలు తీవ్రంగా పడిపోయాయి. కిలో 3 నుంచి 4 రూపాయలే పలుకుతోన్న ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. రైతులు ఆందోళనలో ఉన్నారు. కూలీలు, రవాణా ఖర్చులు సైతం రాక రైతులు దిగాలుపడతున్న స్థితి ఆందోళనకరంగా మారింది. ధర పతనం దారుణంగా...
అగ్ని ప్రమాదంలో దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు శర వేగంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి నుంచి భవనం కూల్చివేత పనులు సాగుతున్నాయి. చుట్టుపక్కల భవనలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు పనులు చేయిస్తున్నారు. పోలీస్, ఫైర్ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. భారీ క్రేన్ సాయంతో కూల్చివేత పనులు చేస్తోంది కాంట్రాక్ట్ సంస్థ. అయితే, ఇప్పటివరకు పది పన్నెండు శాతం పనులు మాత్రమే కంప్లీట్ చే...
అందాల నటి జమున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందంతో కాక, అభినయంతో ఆకట్టుకున్నారు. మాతృ భాష తెలుగు కాకున్నా ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. కర్ణాటకలో గల హంపిలో 1936 ఆగస్ట్ 30వ తేదీన నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు జమున జన్మించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యం గడిచింది. జమునకు జనాభాయి అని పేరు పెట్టరాట.. జన్మ నక్షత్రం రీత్యా నది పేరు ఉండాలని జ్యోతిష్కు...