జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆదరణ పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల ప్రముఖులు వచ్చి కేసీఆర్ తో సమావేశమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో కలిసి వస్తామని ప్రకటించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పలు పార్టీలు బీఆర్ఎస్ ల...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ రైతు వ్యతిరేక, పేదల వ్యతిరేక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై హరీష్ స్పందించారు. ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి బడ్జెట్లో దాదాపు 30 శాతం కోత విధించారన్నారు. ఎరువుల సబ్సిడీని తగ్గించి రైతులపై అదనపు భారం మోపుతున్నా...
మాసబ్ ట్యాంక్ లోని మత్స్య శాఖ కార్యాలయంలో నూతన ఫిష్ క్యాంటీన్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేపలు, రొయ్య పిల్లలు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. గడిచిన ఈ ఎనిమిది ఏండ్లలో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని పేర్కోన్నారు. ముఖ్య...
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో పరిణామం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయాలు వేడెక్కగా బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత హీటెక్కాయి. తాజాగా ఈ గవర్నర్ వ్యవహారంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ లో అపాయింట్ మెంట్ కోరారని పార్టీ వర్గాలు తెలిపారు. గురువారం గవర్నర్ తమిళిసైని షర్మిల కలువనున్నారు....
తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లో 1601 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ మేరకు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని సంస్థ సీఎండీ రఘుమారెడ్డిని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశించారు. వీటిలో 1553 జూనియర్లైన్మెన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత రబీ సీజన్, రాబోయే ఎండాకాలంలో నిరంతర విద్యుత్తు సరఫ...
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని 11 వ వార్డు 14వ వార్డు మధ్య మ్యాచ్ ను నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో వార్డు పరి...
ప్రపంచంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభామేళాగా ఖ్యాతి పొందిన ములుగు జిల్లాలోని మేడారంలో సందడి మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ జాతర జరుగనుంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుందని అందరికీ తెలిసిందే. మహా జాతర తర్వాతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగె పండగ వస్తుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ [&...
తెలంగాణలో అధికార పార్టీ లక్ష్యంగా కేంద్ర సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు రావడం, భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరి మీద దాడులు జరుగుతాయో తెలియడం లేదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం.. కేంద్ర సంస్థ...
ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న ఆ శుభ సమయం వచ్చింది. తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 11,105 టీచర్ పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు మొదలు కసరత్తు చేస్తుంది. పీఈటీ, పీడీ పోస్టులకు వివాదలు నెలకొనడంతో వాటిని మినహాయించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు నిర్ణయానికి వచ్చింది. దీంతో మిగతా పోస్టులన్నింటికీ కలిపి వీలైనంత త్వరలో ఉద్యోగ ప్రకటనలు రిలీజ్ చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఈ ...
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్ సెక్రెటరీగా నియమించారు. హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ చేశారు. అమయ్కుమార్ను మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా నియమించడమే ...
తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఏప్రిల్ 14వ తేదీన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బర్త్ డే అని, ఆ రోజు వద్దన్నారు. సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు బయల్దేరగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు...
తన అన్నయ్య తనయుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. నా కొడుకు సేఫ్గా ఉన్నాడని, వైద్యులకు పాదాభివందనం అన్నారు బాలయ్య. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని గుర్తు చేశారు. అతనికి హార్ట్ బీట్ కూడా ఆగిపోయిందన్నారు. కానీ అద్భుతం జరిగిందని, మళ్లీ కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. తాము కుప్పం...
టాలీవుడ్ సింగర్ శ్రీ రామ చంద్ర హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతల కోసం ఫ్లై ఓవర్ బ్లాక్ చేయడం ఏంటీ అని ట్వీట్ చేశారు. ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. ఓ రాజకీయ నేత కోసం పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ బ్లాక్ చేశారని తెలిపారు. జనం ఫ్లై ఓవర్ కింద నుంచి వెళ్లాల్సి వచ్చిందట. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెహికిల్స్ రద్దీతో ప్రయాణం అరగంట […]
భారతదేశంలోనే అత్యధిక లాభాలతో కొనసాగుతూ.. సిరులు కురిపిస్తున్న సంస్థ సింగరేణి. ఈ సంస్థలో ఉద్యోగమంటే ఉత్తర తెలంగాణ ప్రాంత యువతకు ఓ కలలాంటిది. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలని ఎప్పటి నుంచో నిరుద్యోగులు కలలు కంటున్నారు. అలాంటి వారికోసం సింగరేణి మరో ప్రకటన విడుదల చేయనుంది. సింగరేణి సంస్థలో 558 ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని సింగరేణి సంస్థ ప్రకటించింది. ...
తనను తెలంగాణ నుంచి తరిమేస్తారా.. తరిమేయండి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అని తెలిపారు. తాను మాత్రం ధర్మ మార్గం విడవని ప్రకటించారు. విద్వేష ప్రసంగాలతో మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారంటూ తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మంగళవారం స్పందించారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. తన జీవితం ధర్మం కోసమేనని ప్రకటించారు. ఎక్కడో ముంబైలో మాట్లాడితే ఇక్కడ పోలీసులు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్న...