తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి, కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించడం ఏంటీ అని ప్రశ్నించారు. ఏప్రిల్ 14వ తేదీన సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన కేసీఆర్ బర్త్ డే అని, ఆ రోజు వద్దన్నారు. సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు బయల్దేరగా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు, ప్రభుత్వ వైఖరిని కేఏ పాల్ ఎండగట్టారు. గత కొన్నిరోజుల నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పాల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఏ ఇష్యూపైనా అయినా సరే వేంటనే స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు బై పోల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు.