భారతదేశంలోనే అత్యధిక లాభాలతో కొనసాగుతూ.. సిరులు కురిపిస్తున్న సంస్థ సింగరేణి. ఈ సంస్థలో ఉద్యోగమంటే ఉత్తర తెలంగాణ ప్రాంత యువతకు ఓ కలలాంటిది. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయాలని ఎప్పటి నుంచో నిరుద్యోగులు కలలు కంటున్నారు. అలాంటి వారికోసం సింగరేణి మరో ప్రకటన విడుదల చేయనుంది. సింగరేణి సంస్థలో 558 ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటన విడుదల చేస్తామని సింగరేణి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
సింగరేణిలో 558 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్ తెలిపారు. 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో భర్తీ చేస్తామని వెల్లడించారు. మిగిలిన 281 పోస్టులను అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేస్తామని వివరించారు. ఏయే విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తున్నారో సవివరమైన ప్రకటన విడుదల చేశారు. ఈ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. 30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు:, మేనేజ్మెంట్ ట్రైనీలు:, మైనింగ్(79); ఎలక్ట్రికల్, మెకానికల్ (66), సివిల్(18), ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ (10), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్(18), ఐటీ(7), హైడ్రోజియాలజిస్ట్ (2), పర్సనల్ (22)తో పాటు 3 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, 10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, 16 సబ్ ఓవర్సీర్ ట్రైనీ (సివిల్).