Mynampally Hanumantha Rao Slams Minister Harish Rao
Mynampally Hanumantha Rao: తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. మెదక జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
మెదక్‌ను కల్వకుంట్ల ఫ్యామిలీ ఏమీ చేయలేదని మండిపడ్డారు. కోట్లలో దోచుకుని దాచుకున్నారే తప్ప ఏమీ చేయలేదని ఆరోపించారు. మెదక్‌ను పట్టించుకుంటే అభివృద్ధి సాధించేదని.. గజ్వేల్, సిరిసిల్లను మించిపోయేదని వివరించారు. తాను వచ్చిన తర్వాత మెదక్ రూపు రేఖలు మారిపోయానని తెలిపారు. మెదక్‌కు మెడికల్ కాలేజీ, రామాయంపేటకు రెవెన్యూ డివిజిన్, డిగ్రీ కాలేజీ వచ్చాయని తెలిపారు.
మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumantha Rao). కరోనా సమయంలో తన కుమారుడు మైనంపల్లి రోహిత్ ఎక్కడికి వెళ్లాడని అంటున్నారని.. అదీ అతని విజ్ఞతకే వదిలేస్తున్నానని వివిరంచారు. అతను మంత్రి లాగా కాకుండా గల్లీ లీడర్ మాదిరిగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సేవా కార్యక్రమాలు చేసే సత్తా ఉంటే తమతో పోటీ పడాలని సూచించారు.
మంత్రి హరీశ్ రావు తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని మైనంపల్లి అంటున్నారు. నిజానికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. ఇదివరకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇవ్వలేదు. తనతోపాటు కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడారు. మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి కామెంట్లను తిప్పికొట్టారు.