Jantar Mantar : ఢిల్లీలో ఒక నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నరు. మహిళా దినోత్సవం పురుస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు
బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నరు. మహిళా దినోత్సవం పురుస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనాతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో లో రెండు సార్లు హామీ ఇచ్చి మాట తప్పుతుందని కవిత మండిపడ్డారు.
ఇందుకు నిరసనగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.మార్చి 13 నుంచి పార్లమెంట్(Parliament) సమావేశాలు ఉంటాయి కాబట్టి.. ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. 2019లో కూడా అదే మాట చెప్పారు. కానీ ఆ హామీలను మాత్రం ఇంత వరకు అమలు చేయలేదని కవిత గుర్తు చేశారు.
జనాభా గణన చేయకపోవడం ఇంకా దురదృష్టం అని పేర్కొన్నారు. జనాభా లెక్కల్లో ఓబీసీ (OBC) జనాభాను ప్రత్యేకంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం.. రిజర్వేషన్లు కల్పించాలని కవిత సూచించారు. దేశంలో బీసీ గణన కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు కూడా వినిపిస్తుండడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ (CBI) అరెస్ట్ చేసిన నేపథ్యంలో…. తర్వాత అరెస్ట్ కవితదే అని ప్రచారం జరుగుతోంది. దీనిపై మీడియా కవితను ప్రశ్నించింది. అందుకు కవిత బదులిస్తూ… బీజేపీ (BJP) నాయకులు చెబితే నన్ను అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అలా చేస్తే అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. అరెస్ట్ గురించి ఏ దర్యాప్తు సంస్థ చెప్పాలో ఆ సంస్థే చెప్పాలి తప్ప బీజేపీ (BJP) నేతలు కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని బీజేపీ (BJP) నేతలు తెలుసుకోవాలి” అని కవిత హితవు పలికారు.