»Mlc Kavitha Special Pooja To Alampur Balabrahmeswaruswami
MLC Kavitha : బాలబ్రహ్మేశ్వరస్వామికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ (Alampur ) బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి( Balabrahmeshwar) ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకూంభంతో స్వాగతం పలికారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ (Alampur ) బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత( Mlc kavitha) దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి( Balabrahmeshwar) ప్రత్యేక పూజాలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు పూర్ణకూంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్సీ కవితకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. లయకారునిగా, అర్ధనారీశ్వరునిగా హిందువులు కొలిచే ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR).. సారథ్యంలో తెలంగాణ దూసుకుపోతోందని, అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషిచేస్తున్నామని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏటా బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం. తెలంగాణ(Telangana) ఏర్పడిన తర్వాత అన్ని ఆలయాలకు అధిక నిధులు కేటాయిస్తున్నాం. కొండగట్టు( Koṇḍagaṭṭu) అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించాం. వేద పండితులు, బ్రాహ్మణులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది.
नमस्ते भगवान रुद्र भास्करामित तेजसे। नमो भवाय देवाय रसायाम्बुमयात्मने।।