Govardhan VS Shabbir Ali: కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్దన్ (Govardhan) వర్సెస్ షబ్బీర్ అలీ (Shabbir ali) మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నాణ్యతపై అలీ (ali) ప్రస్తావించగా.. బాగున్నాయని గోవర్ధన్ (Govardhan) తేల్చిచెప్పారు. టెక్రియాల్‌లో వచ్చి చూద్దామని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్నారు. ఈ రోజు ఉదయమే డబుల్ బెడ్ రూమ్ వద్దకు షబ్బీర్ అలీ (ali) వచ్చారు.
ఏం జరిగిందంటే..?
టెక్రియాల్‌లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ ఇళ్ల నాణ్యతపై షబ్బీర్ అలీ (ali) విమర్శలు చేశారు. ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు లబ్దిదారులు భయపడుతున్నారని చెప్పారు. ఆ ఇళ్లలో నాణ్యత కనిపించడం లేదన్నారు. షబ్బీర్ అలీ (ali) విమర్శలు చేయగా.. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Govardhan) స్పందించారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే ఓర్వలేదంటున్నారు. ఇళ్ల నాణ్యతకు ఢోకా లేదని చెప్పారు. 50 ఏళ్లకు పైగా చెదరకుండా ఉంటాయని తెలిపారు.
ఇంజినీర్లు అవసరం లేదు.. మేస్త్రీలు చాలు
ఇంజినీర్లను తీసుకురావాలని.. తాను కూడా ఇంజినీర్లతో వస్తానని పేర్కొన్నారు. గోవర్ధన్ సవాల్‌ను షబ్బీర్ అలీ (Shabbir ali) స్వీకరించారు. సోమవారం ఉదయం టెక్రియాల్ చేరుకున్నారు. ఇంజినీర్లు అవసరం లేదని అన్నారు. మేస్ట్రీలు చాలాని.. వారితో వచ్చానని తెలిపారు. అవసరం అయితే ఇంజినీర్లను (Engineers) పిలుస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వచ్చి ఇళ్ల నాణ్యత చూపించే వరకు ఇక్కడినుంచి వెళ్లనని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గోడలకు ఏర్పడిన పగుళ్లను, కర్రముక్కతో తడితే పెచ్చులూడుతున్న విధానాన్ని షబ్బీర్ అలీ (Shabbir ali) చూపించారు.