»Minister Harish Rao Inaugurated The New Sub Station
Sangareddy : నూతన సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ (Telanagna) రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్(sub station) ను ప్రారంభించారు.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని ఎల్గోయి గ్రామంలో నూతనంగా రూ.1.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్(sub station) ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల హాయంలో అనేక సమస్యలు ఉండేవని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం అనేక సమస్యలను సీఎం కేసీఆర్ (CM KCR) తీర్చారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు .మహిళలకు గృహలక్ష్మి పథకం(Grilahakshmi Scheme) ప్రారంభిస్తామన్నారు.
డ్వాక్రా మహిళలకు(Dwakra woman) త్వరలోనే వడ్డీని జమ చేస్తామన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఇల్లు లేని పేద వారికి రూ.3 లక్షలు అందిస్తామని తెలిపారు.యువత కోసం త్వరలోనే స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ (Skill Development Centre) ను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా గ్రామంలో అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ భవనాలు (Community buildings) నిర్మించుకునేందుకు స్థలం కొరకు సర్వే మ్యాప్ తయారు చేసి జనాభా ప్రాతిపదికన అందించాలని, లేఅవుట్(Layout) తయారు చేసి ఇళ్లు లేని వారికి స్థలాలు ఇప్పిస్తామని తెలిపారు. అంతకు ముందు మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు.