కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి నేడు… బీజేపీలో చేరారు. ఆయన కమలం గూటికి చేరే కార్యక్రమంలో… బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ లో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాడుతుందని పేర్కొన్న ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నారు. కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ సమక్షంలో బీజేపీలో చేరారు మర్రి శశిధర్ రెడ్డి.