»Manchu Vishnu Clarity On The Video Released By Manoj
Manchu Vishnu : మనోజ్ విడుదల చేసిన వీడియోపై మంచు విష్ణు క్లారిటీ
సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని ఆయన తెలిపారు.
సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు ఓ వీడియోతో స్పష్టమైంది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. ఈ ఘటన నిన్న ఉదయం జరిగిందని, ఇదేమంత పెద్ద గొడవ కాదని క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తన తమ్ముడని, తామిద్దరి మధ్య గొడవలు సాధారణమైన విషయం అని మంచు విష్ణు తెలిపారు. సారథి (Sarathi) తనతో గొడవ (fight)పెట్టుకుంటే, మనోజ్ ఈ వాగ్వాదాన్ని ఆపలేకపోయాడని ఆయన తెలిపారు. తన సోదరుల మధ్య జరిగిన గొడవపై మంచు లక్ష్మి స్పందించారు.
మంచు విష్ణు, మనోజ్ మధ్య జరిగిన విషయం గురించి తనకింకా తెలియదని, పూర్తి వివరాల్ని తెలుసుకుని మాట్లాడతానని చెప్పారు. విషయం గురించి పూర్తిగా తెలియకుండా వార్తల్ని స్ప్రెడ్ చేయడం సరికాదన్నారు. ప్రస్తుతం తాను బంధువులతో బిజీగా ఉన్నానని, అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తున్నానని మంచు లక్ష్మి (Manchu Lakshmi) తెలిపారు. ఇంటి సభ్యులు, అన్నదమ్ముల మధ్య జరిగే గొడవగా పరిగణనలోకి తీసుకోవాలని మంచు లక్ష్మి విన్నవించారు.మనోజ్ చిన్నవాడు కనుక ఏదో కోపంలో ఆ వీడియోను పోస్టు చేసి ఉంటాడని, దీన్ని పట్టించుకోనవసరం లేదని విష్ణు వెల్లడించారు.
వీడియోను మనోజ్ స్వయంగా సోషల్‌మీడియా (Social media)వేదికగా షేర్ చేయడం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ‘ఇండ్లలోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇదీ ఇక్కడి పరిస్థితి’ అంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు. తన అనుచరుడు సారధి ఇంటికి వెళ్లి అతడిపై మంచు విష్ణు దాడి చేసినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్ ఫేస్బుక్(Facebook), ఇన్‌స్టా స్టోరీస్‌లో స్టేటస్‌గా పెట్టి.. కొద్దిసేపటి తర్వాత తొలగించాడు..