Man who called bomb threat to Praja Bhavan in police custody
Praja Bhavan: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు మంగళవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తెలిసిందే. ఈ కేసులో పంజాగుట్ట దర్యాప్తు చేప్టటారు. 24 గంటల లోపే పోలీసులు ఆ ఆగంతుకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు ఉందని మరో మది నిమిషాల్లో పేలుతుందని కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో రంగంలో దిగిన భద్రత సిబ్బంది బాంబును గాలించారు. తరువాత కాల్ చేసింది ఓ ముఠా నుంచి కాదు లోకల్ నుంచి అని తెలుసుకున్నారు. తరువాత అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
అతని పేరు శివరామకృష్ణ అని తాను కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు శివరామకృష్ణ ముషీరాబాద్‌లో నివాసం ఉండే గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు. అయితే తానే సొంతంగా ఫోన్ చేశారా, లేదా అతని వెనుక ఎవరన్నా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రజాభవన్‌లో బాంబు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.