Yadagirigutta : మే 2 నుంచి లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాలు
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి (Lakshmi narasimha swamy) జయంత్యుత్సవ ఏర్పాట్లపై ఈవో గీత వివరించారు. మే 2 నుంచి జయంత్యుత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి (Lakshmi narasimha swamy) జయంత్యుత్సవాలు మే 2వ తేది నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత(EO Geetha) వెల్లడించారు. మూడు రోజులు ఈ జయంత్యుత్సవాలు(Jayantyutsavaalu) జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల్లో 2 తేదిన ఉదయం 9.30 గంటలకు స్వస్తివాచనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్ వరణం, కుంకుమార్చన వంటివి నిర్వహించనున్నామన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం నిర్వహించాక గరుడ వాహనం(Garuda vaahanam)పై పరవాసుదేవ అలంకార సేవ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
మే 3వ తేదిన బుధవారం ఉదయం 9.30 గంటలకు నిత్యమూలమంత్ర హవనం, లక్షపుష్పార్చన, కాళీయమర్దన అలంకార సేవ ఉంటాయని ఈవో గీత(EO Geetha) తెలిపారు. సాయంత్రం హనుమంత వాహనం(Hanumanta vaahanam)పై రామావతారం అలంకార సేవ ఉంటుందన్నారు. 4న ఉదయం 7 గంటలకు స్వామివారి మూలమస్తృ హవనం, ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకూ మహాపూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకం వంటివి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి (Lakshmi narasimha swamy) జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆలయంలో జరిగే సుదర్శన నారసింహ హోమం, నిత్య,శాశ్వత తిరుకళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలను నిలిపివేస్తున్నట్లు ఈవో గీత వెల్లడించారు. దీంతో పాటుగా పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, జనగామ దబ్బగుంటపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జయంత్యుత్సవాల(Jayantyutsavaalu)ను వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.